వైసీపీలో గందరగోళం రేపిన పీకే…

0
319
brand pk as ysrcp covert

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ నిన్న చంద్రబాబును కలవడంతో సంచలనంగా మారింది. ఈ కలయిక వైసీపీ శ్రేణుల్లో తీవ్రమైన గందరగోళానికి దారితీసిందని చెప్పవచ్చు. ప్రశాంత్‌ కిషోర్‌ తెలుగుదేశం పార్టీలోకి టచ్‌లోకి వెళ్లినట్లు వైసీపీ అధిష్టానానికి ముందే ఉప్పందింది.

10 రోజుల క్రితమే లోకేష్‌ను ఢల్లీిలో పీకే కలిసినట్లు జగన్‌ Ê కోకు సమాచారం ఉంది. అయినప్పటికీ దాన్ని ఎమ్మెల్యేలకు, దిగువ శ్రేణి నేతలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే శనివారం పీకే ఏకంగా లోకేష్‌తో కలిసి ప్రత్యేక జెట్‌ విమానంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రావడం..

brand pk as ysrcp covert

పీకేకు సోషల్‌ మీడియా ప్రచార బాధ్యత మాత్రమే?

ఒకే కారులో ఇద్దరూ కరకట్టలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడంతో మీడియాలో ఇది బ్రేకింగ్‌ న్యూస్‌గా మారింది. దీంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులు టెన్షన్‌లోకి జారుకున్నాయి.

గతంలో తమ పార్టీకి పనిచేసినపుడు ప్రశాంత్‌ కిషోర్‌కు పార్టీకి సంబంధించిన అన్ని లోటు,పాట్లు తెలిసే ఉంటాయని, అలాగే అతని సలహాలు, సూచనల మేరకే పార్టీ నడుచుకుని అధికారానికి చేరువైందని, ఇప్పుడు తమ బలాలు, బలహీనతలు ప్రత్యర్థులకు పీకే చేరేవేస్తే రాజకీయంగా తీవ్రంగా నష్టపోతామనే భయం ఆ పార్టీ శ్రేణులను నిద్రపోనివ్వడం లేదు.

ఎన్నికలకు ఇంకా 2 నుంచి 3 నెలలు మాత్రమే ఉన్న ఇలాంటి తరుణంలో ఈ హఠాత్‌ పరిణామం తమకు తీరని నష్టం చేస్తుందని వారి భావన.

పీకే ఇప్పటికే ఐప్యాక్‌ బాధ్యతల నుంచి తప్పుకుని చాలాకాలం అయిందని సరిపెట్టుకుందామనుకున్నా.. పీకే ఆలోచనల్లోంచి పుట్టిన ఆయన మానసపుత్రిక ఐడియాలు ఆయనకు తెలియనివి ఐతే కావు.

ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే పీకే తమకు దూరం అవుతున్నారని కొద్ది నెలల క్రితం..

కేవలం అభివృద్ధిని మాత్రమే నమ్ముకుని సంక్షేమాన్ని పక్కకు పెడితే ఆ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయని, ఇందుకు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్‌ను పేర్కొనటం, నేను ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని గెలిపించి తప్పుచేశానేమో అనిపిస్తోంది.. అని వ్యాఖ్యానించారు.

అప్పుడే వైసీపీ మేల్కొని ఉంటే బాగుండేదని కిందిస్థాయి కేడర్‌ భావిస్తున్నారు. తీరా ఇప్పుడు చంద్రబాబును కలిసి 2 గంటలు చర్చలు జరిపిన తర్వాత వైసీపీకి నష్టం కాకుండా లాభం జరుగుతుందని భావించడం అమాయకత్వమే అవుతుందని ఓ వైసీపీ నేత చెప్పుకొచ్చారు.