జగన్‌ పరువు నిట్టనిలువునా తీసిన ఎమ్మెల్యే…

0
349
MLA who defamed Jagan

అధికారం చేతిలో ఉంటే తామేదో దైవాంశ సంభూతులం అనుకుంటూ విర్రవీగుతుంటారు కొందరు నాయకులు. సమష్టి కృషితో దక్కిన పీఠం తమ సింగిల్‌ చరిష్మా పుణ్యం అనుకుంటూ తోటి ఎమ్మెల్యేలను పట్టించుకోరు. పట్టించుకోవడం తర్వాత చులకన చేసి, పలుచన అవుతుంటారు.

తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇలాంటి చులకన ట్రీట్మెంట్‌కు నొచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కారణంగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి మొన్న రాజీనామా కూడా చేశారు.

రాజీనామాకు గల కారణాలు, తదనంతర పరిణామాలపై ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆయన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యంగా జగన్‌ కాంపౌండ్‌లో అయితే చెప్పక్కర్లేదు.

ఆర్‌.కె. మీడియాతో ‘‘ తొమ్మిదిరన్నర సంవత్సరాల పాటు మంగళగిరి ప్రజలు వారికి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించారు. నాడు మంత్రి పదవిలో ఉన్న లోకేష్‌ను ఓడిరచటానికి నేను శాయశక్తులా కష్టపడ్డాను.

ఇందుకోసం మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు మాట కూడా ఇచ్చాము. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదిగో ఇదిగో అని కాలయాపన చేస్తూ వచ్చారు.

2014 నుంచి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం వల్లనే లోకేష్‌ను ఇక్కడి ప్రజలు ఓడిరచారు.నాడు నా నియోజకర్గానికి ముఖ్యమంత్రిగారు 1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తామని చెప్పారు.

మేం డీపీఆర్‌లు కూడా సిద్ధం చేసుకున్నాం. కానీ దాన్ని కుదించి, కుదించి చివరికి 120 కోట్లకు తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యలను కూడా పరిష్కరించటానికి నాడు హామీలు ఇచ్చాము.

ఇప్పటికీ అవి పరిష్కారానికి నోచుకోలేదు. కొన్ని పనులు అయితే నేను వేరేచోట్ల డబ్బులు తెచ్చి కాంట్రాక్టర్‌లకు చెల్లించాల్సి వచ్చింది.

చేసిన ఆ కొద్దిపాటి పనులకు ఇంకా కాంట్రాక్టర్‌లకు బిల్లులు రాలేదు. ఇలా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకుండా మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేస్తాను.

అందుకే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నేను రాజశేఖరరెడ్డి భక్తుణ్ణి. ఆయన కుటుంబంతోనే ఉంటాను. షర్మిళ గారి నిర్ణయంపైనే నా ఫ్యూచర్‌ ప్లాన్‌ ఉంటుంది. రాజకీయాల్లోనే ఉంటాను అన్నారు.