కొడాలిపై వంగవీటి రాధా ఫైర్‌?

0
212
Vangaveeti Radha fire on Kodali
Vangaveeti Radha fire on Kodali

ఎప్పటికెయ్యది సేయ తగునో.. అప్పటికది సేయుట ధన్యము సుమతీ అంటారు. కానీ ఆ సేసింది మనకు పాజిటివ్‌ అయిందా? నెగెటివ్‌ అయ్యిందా అనేది కొంత సమయం తరువాతగానీ తెలియదు.

తాజాగా వంగవీటి రాధాకృష్ణ పట్ల వైసీపీ వేసిన ఓ మాస్టర్‌ ప్లాన్‌ కాస్తా బెడిసికొట్టి ఆయనతో చివాట్లు తినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

కాపు సామాజికవర్గంలో, ముఖ్యంగా కోస్తా బెల్ట్‌లో దివంగత నాయకుడు వంగవీటి మోహనరంగాకు ఓ ఇమేజ్‌ ఉంది. ఆ ఇమేజ్‌ రంగా కుమారుడు రాధాకు కూడా వారసత్వంగా వచ్చింది.

ఈ కారణంగానే అతి పిన్న వయస్సులో రాధా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాగలిగారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో వైసీపీలోకి వెళ్లారు.

2019 ఎన్నికల్లో రాధాకు విజయవాడ తూర్పు సీటు ఇస్తామని కాసేపు, ఆ తర్వాత లేదు లేదు విజయవాడ సెంట్రల్‌ సీటు అని కాసేపు, అబ్బే ఆ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక ఓటర్లు అధికంగా ఉన్నారు.

వారిలో మీ ఫ్యామిలీ మీద మంచి అభిప్రాయం లేదు అని కాసేపు రాధా రాజకీయ జీవితంతో ఆడుకోవాలని చూశారు. చివరికి బందరు ఎంపీగా పోటీ చేయమని చెప్పారు.

దీంతో రాధా వైసీపీలోంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. ప్రస్తుతం రాధా టీడీపీలోనే ఉన్నట్లు లెక్క.

ప్రస్తుతం ఉన్న రాజకీయ ఇబ్బందుల దృష్ట్యా వైసీపీ ఎలాగైనా రాధాను తమ పార్టీలోకి తీసుకురావలని ప్రయత్నాలు ప్రారంభించింది.

Chandrababu never leaves a lemon
Chandrababu never leaves a lemon

ఇందులో భాగంగా ముందు ఆయన్ను టీడీపీకి దూరం చేయాలనే ఆలోచన అమలు చేయడం మొదలెట్టింది. ఇటీవల రాధా తన తండ్రి రంగా వర్ధంతి సందర్భంగా కాశీలో ప్రత్యేక పూజలు చేయటానికి వెళ్లారు.

అక్కడికి గుడివాడ ఎమ్మెల్యే, రాధా సన్నిహితుడు కొడాలి నాని కూడా వెళ్లారట. స్నేహితుడిగా అక్కడికి వెళ్లిన నాని, రాధాలు కలిసి ఉన్న ఫొటోలను వైసీపీ లీక్‌ చేసి,

అదిగో రాధా వైసీపీలోకి వస్తున్నాడు అంటూ ఫాల్స్‌ ప్రచారం మొదలెట్టారు. ఈ విషయం గ్రహించిన రాధా కొడాలి నానిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ…

‘‘ఇది కరెక్ట్‌ కాదన్నా.. మనది స్నేహం. మీరు ఇలా మన స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆ ఫొటోలను మీ పార్టీకి నాయకులకు పంపుకుంటే వారు చూడండి ఎలా ప్రచారం చేస్తున్నారో.

మీరు చేసిన తప్పుకు ఎంత రచ్చ జరుగుతోందో చూడండి’’ అన్నారట. ఈ విషయం రాధా సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

మరోవైపు ఇదే అదనుగా రాధాకు సన్నిహితంగా ఉండే ముగ్గురు దూతలను ఆయన్ను మళ్లీ వైసీపీ వైపు లాగేందుకు పంపారట. వారి ప్రతిపాదన విన్న రాధా ‘‘సిగ్గు, శరం లేని రాజకీయాలు చేయడం మీ పార్టీకి బాగా అలవాటు,

అలాంటివి మీకేమన్నా ఉంటే.. ముందు ఆపార్టీని మీరు వదిలిపెట్టి బయటకు రండి అంటూ క్లాస్‌ పీకి పంపారట.