కాక రేపుతున్న చంద్రబాబుతో షర్మిళ భేటీ…

0
298
Sharmila meets Chandrababu who is rousing

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో శనివారం మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కోరుతూ శుభలేఖ ఇవ్వటానికి కాంగ్రెస్‌ నాయకురాలు వై.యస్‌. షర్మిళరెడ్డి నారా చంద్రబాబు నివాసానికి విచ్చేశారు.

దాదాపు అరగంటకు పైగా చంద్రబాబు నివాసంలో షర్మిళ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి, చంద్రబాబుకు కలిపి షర్మిళ ఆహ్వాన పత్రికను అందజేశారు.

అనంతరం కొద్దిసేపు పెళ్లికి సంబంధించిన వివరాలు, ఇరు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాలు, రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

షర్మిళ`చంద్రబాబు భేటీ ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం కాకరేపుతోంది. ఇప్పటిక అన్న జగన్‌మోహన్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న షర్మిళ ఆయన రాజకీయ పతనాన్ని కోరుకుంటున్నట్లు పలు సందర్భాలలో చేసిన వ్యాఖ్యల ద్వారా,

This is a huge relief for Babu tdp leader

జగన్‌ శత్రువులను కలవడం ద్వారా చెప్పకనే చెప్పారు షర్మిళ. ఈ తాజా భేటీలో ఏఏ అంశాలు చర్చలకు వచ్చాయో అని వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. అయితే షర్మిళ తన కుమారుడి పెళ్లికి అందరినీ ఆహ్వానించిట్లుగానే చంద్రబాబును కూడా ఆహ్వానించటానికి వచ్చినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు దంపతులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి బయటకు వచ్చిన అనంతరం షర్మిళను మీడియా పలు ప్రశ్నలు వేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

మా కుమారుడి వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించటానికి వచ్చాను. అంతే తప్ప ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. క్రిస్మస్‌ సందర్భంగా పంపిన కేకు విషయంలో కూడా మీడియా బాగా హడావుడి చేసింది.

ఆరోజు వీరొక్కరికే కాదు.. చాలా మందికి పంపాను. అప్పుడు లోకేష్‌గారు రిప్లై మెసేజ్‌లో చక్కగా స్పందించారు. లోపల రాజకీయ అంశాలకన్నా నాన్న రాజశేఖరరెడ్దిగారి గురించి,

నాన్నకు, బాబు గారికి ఉన్న స్నేహం గురించి బాబుగారు గుర్తు చేసుకున్నారు. నేను కాంగ్రెస్‌ నాయకురాల్ని మా పార్టీ అధిష్టానం ఏం చెబితే అది చేస్తాను. రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో ఉన్నా..

కుటుంబ ఫంక్షన్‌కు ఒకరినొకరు పిలుచుకోవడం రాజకీయాల్లో సహజమే కదా. ఈ భేటీని కూడా ఆకోణంలో చూడండి అన్నారు.

అయినా రాజకీయాల్లో బద్ధ శత్రువుల కుటుంబాల్లోని వ్యక్తులు కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటే మీడియా పలుకోణాల్లో చూడకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి.