నాది అంబేద్కర్‌ రాజ్యాంగ పవర్‌… జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం

0
423
lokesh yuvagalam

యువగళం ముగింపు సభలో నారా లోకేష్‌ తనదైన శైలిలో సెటైర్‌లతో, పంచ్‌లతో ప్రసంగం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. నేను చిత్తూరులో పాదయాత్రను మొదలు పెట్టాను. దాన్ని అడ్డుకోవటానికి ఈ సైకో జగన్‌ పోలీసుల్ని వాడుకుని చాలా ఇబ్బందులో కలిగించాడు. మైక్‌లు లాక్కున్నారు.

నేను నిలబడి మాట్లాడుతున్న కుర్చీలు లాక్కున్నారు. పాదయాత్రను ఆపాలని జీఓ 1 తీసుకొచ్చారు. ఆరోజే చెప్పాను. సాగనిస్తే ఇది పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్రే అని. జగన్‌కు చంద్రబాబు గారిని చూస్తే భయం.. పవన్‌ అన్నను చూస్తే భయం.. ఎంతకాలం ఇలా భయంతో ప్యాలెస్‌లో దాక్కుంటావు జగన్‌.

lokesh yuvagalam

ఏపీ కాంగ్రెస్‌కు ఒక రేవంత్‌రెడ్డి కావాలి!…

చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. జగన్‌ను చూస్తే అప్పుల అప్పారావు గుర్తుకు వస్తాడు. ఈ సభ బొమ్మ చూసి తాడేపల్లిలో జగన్‌కు దిమ్మ తిరుగుతూ ఉంటుంది. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుంది. యువగళం ముగింపు సభ కాదు.. సైకో పాలన అంతానికి ప్రారంభ సభ.

తాడేపల్లి తలుపులు బద్ధలుకొట్టే వరకూ యుద్ధం ఆగదు. చంద్రబాబు, పవన్‌ అన్న, బాలయ్యను ఒకే వేదికపై చూసి జగన్‌కు వణుకు మొదలైంది. లక్ష కోట్లు రాష్ట్ర సంపద లూటీ చేసిన వాడు పేదవాడా?.
నా గొంతు నొక్కే మొగాడు ఇంకా పుట్టలేదు. పుట్టడు కూడా.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాను వాటికి ఉన్న ప్రత్యేకతలను బట్టి అగ్రగామిగా నిలబెడతాం. రాజధానిగా అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతాం. జగన్‌ అరెస్ట్‌ అయితే రోజుకో స్కాం బయట పడుతుంది. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట అడాడు గానీ.. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు.

ప్రత్యేక హోదాను అటకెక్కించాడు. విశాఖ ఉక్కును అమ్ముకోవటానికి సహకరిస్తున్నాడు. సాగునీటి ప్రాజెక్ట్‌లను గాలికొదిలేసింది. మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్‌ అంటే ఏమిటో చూపిస్తాం. యువగళం పాదయాత్ర నాకు ఎంతో నేర్పింది.

అందరి కష్టాలు తెలుసుకునే అద్భుతమైన అవకాశం ఈ పాదయాత్ర ద్వారా నాకు లభించడం నాకు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా అన్నారు.