11 మంది కిడ్నాప్‌ కేసులో వైసీపీ సీమ ఎమ్మెల్యే.. రంగంలోకి కలెక్టర్‌..

0
201
YCP Seema MLA in the case of 11 peoples kidnapping

అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటారు కొందరు నాయకులు. పైవారి అండదండలు పుష్కలంగా ఉన్నవారైతే మరీను ఎంతటి తీవ్ర నేరాలకు పాల్పడటానికైనా వెనకాడరు.

దీనికి తోడు స్థానిక పోలీసుల అండదండలు ఉంటే ఇక చెప్పేదేముంది.. పైగా ఫ్యాక్షన్‌ కక్షలకు నెలవుగా మారిన ప్రాంతం అయితే ఇక చేయగలిగేదేది ఏముంది.

ఈ కారణంగానే అనంతపురంజిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఓ కిడ్నాప్‌ వ్యవహారంలో ఇరుక్కున్నారు. ఏకంగా 11 మందిని కిడ్నాప్‌ చేసినట్లు ఆయనపై కేసు నమోదు అయింది.

వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలోని కొడిమి ప్రాంతంలో జగనన్న లేవుట్‌ పనులకు గతంలో టెండర్లు పిలిచారు.

దీంట్లో పాల్గొన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన సర్వర్‌ జహాన్‌ అనే కాంట్రాక్టర్‌ విజేతగా నిలిచారు. అనంతరం పనులు మొదలు పెట్టారు.

పనులకు చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో అతనికి విడతల వారీగా బిల్లులు కూడా మంజూరు అయ్యాయి. వీటి నుంచి తనకు కమీషన్‌ ఇవ్వాలంటే స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆయన్ను బెదిరించడం మొదలు పెట్టారు.

అయినా అతను బెదరలేదు. దీంతో ఆగ్రహించిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సైట్‌లో పనుల్లో ఉన్న పశ్చిమబెంగాల్‌కు చెందిన 11 కూలీలు కనపడకుండా పోయారు.

Sharmila meets Chandrababu who is rousing

దీంతో తాను డబ్బులు ముట్టచెప్పలేదని ఆగ్రహించిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వారిని కిడ్నాప్‌ చేయించారని, వారిని ఎలాగైనా కాపాడాలని సదరు కాంట్రాక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఆ ఫిర్యాదును పట్టించుకోని స్థానిక పోలీసులు జహాన్‌పైనే ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక చేసేది లేక పశ్చిమ బెంగాల్‌లోని తమ స్థానిక ప్రాంతమైన మాల్దా నియోజకవర్గ పార్లమెంట్‌ సభ్యుడు ఖాన్‌ చౌదరికి విషయాన్ని చేరవేశారు.

విషయం తెలుసుకున్న ఎంపీ స్వయంగా రంగంలోకి దిగి అనంతపురం జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు, ఫోన్‌లో కూడా విషయం వివరించారట.

దీనిపై విచారణ చేపట్టిన ఎస్పీకి ఆ కార్మికులను ప్రకాష్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు అక్రమంగా నిర్భందించినట్లు తెలుసుకుని చర్యలు చేపట్టారు. రూరల్‌ డీఎస్పీ శివారెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు.

హుటాహుటిన శివారెడ్డి బృందం జగనన్న లేఅవుట్‌కు వెళ్లి విచారణ ప్రారంభించారు. ముందుగా స్థానిక పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న కార్మికులను విడిపించినట్లు తెలుస్తోంది.

పక్కరాష్ట్ర ఎంపీ కలుగజేసుకునే స్థాయికి వెళ్లడంతో తాడేపల్లి పెద్దలు తోపుదుర్తిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.