కుర్చీ మడత పెట్టిన తాతకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆర్ధిక సహాయం!

0
295

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ వచ్చే నెల 12 వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. అయితే అవి మొదలయ్యే ముందే ‘గుంటూరు కారం’ నుండి విడుదలైన ‘ఆ కుర్చీ మడతపెట్టి’ అనే లేటెస్ట్ సాంగ్ సోషల్ మీడియాని ఒక రేంజ్ లో ఊపేసింది.

శ్రీలీల మరియు మహేష్ బాబు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటే చూసేందుకు రెండు కళ్ళు సరిపోలేదు. మహేష్ బాబు ఈ వయస్సులో ఈ రేంజ్ లో డ్యాన్స్ వెయ్యడం అనేది సాధారమైన విషయం కాదు.

అసలే సంక్రాంతి పండుగ, దానికి తోడు ఊర నాటు మాస్ సినిమా, వీటితో పాటు మహేష్ బాబు అదిరిపోయే మాస్ డ్యాన్స్ స్టెప్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే గుంటూరు కారం రికార్డ్స్ ఘాటు మామూలు రేంజ్ లో ఉండేట్టు లేదని అనిపిస్తుంది.

Exciting news for fans about Mahesh-Rajamouli movie

అయితే ఈ కుర్చీ మడత పెట్టి అనే దారిద్రమైన డైలాగ్ కృష్ణ కాంత్ పార్క్ లో కూర్చొని ఉన్న ఒక్క తాతది. ఆ డైలాగ్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండింగ్ అయ్యింది.

ఇంస్టాగ్రామ్ మరియు యూట్యూబ్ రీల్స్, ఇలా ఎక్కడ చూసిన ఈ డైలాగ్ మీద వందల వీడియోస్ చేసారు. సినిమా స్టార్స్ మరియు రాజకీయ నాయకులూ కూడా సందర్భానికి తగ్గట్టుగా వాడేశారు.

అలా మంచి ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్ కాబట్టి, థమన్ ఆ డైలాగ్ ని పెట్టి గుంటూరు కారం లో పాటని కంపోజ్ చేసాడు.

ఈ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చినా, మహేష్ లాంటి సూపర్ స్టార్ ఇలాంటి బూతులు ప్రోత్సహించడం బాధాకరం అని సోషల్ మీడియా లో ఆయన అభిమానులతో పాటుగా నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆ కుర్చీ తాత కనిపించడం లేదని ఆయన కూతురు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి వచ్చి ఏడ్చిన సంగతి తెలిసిందే.

అప్పుడే తాత ఎంట్రీ ఇచ్చి నేనెక్కడికి పోలేదు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నన్ను ఆయన దగ్గరకి తీసుకెళ్లి ఆర్ధిక సహాయం చేసాడు అని చెప్పుకొచ్చాడు.

నా డైలాగ్ తో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ పాట చేయించడం, దానికి మహేష్ బాబు డ్యాన్స్ వెయ్యడం, ఒక అదృష్టం లాగ భావిస్తున్నాను అంటూ కుర్చీ తాత చెప్పుకొచ్చాడు.