గత ఎన్నికలలో భీమవరం మరియు గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్, ఈసారి ఎన్నికలలో ఏ స్థానం నుండి పోటీ చెయ్యబోతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆయన అభిమానులు అయితే అత్యధిక శాతం మంది భీమవరం నుండి పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే భీమవరం లో జనసేన పార్టీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలపడింది.
అంతే కాకుండా స్థానిక వైసీపీ సిట్టింగ్ ఎమ్యెల్యే గ్రంధి శ్రీనివాస్ పై తీవ్రమైన నెగటివిటీ ఉంది. ఈసారి అతను గెలిచే ఛాన్స్ లేదని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఈసారి కనీసం 50 వేల మెజారిటీ తో గెలుస్తాడని, టీడీపీ కూడా కలిసి ఉంది కాబట్టి మెజారిటీ లెక్కపెట్టుకోవడమే అంటూ సర్వేలు సైతం చెప్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ నుండి పోటీ చెయ్యాలి అనే దానిపై తర్జభర్జన పడుతున్నాడు.
ఎందుకంటే ఆయనకీ చాలా ఛాయస్లు ఉన్నాయి. భీమవరం ప్రస్తుతం జరగబొయ్యే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి చాలా సేఫ్ సీట్ కానీ, భవిష్యత్తులో అది సేఫ్ సీట్ కాదు.
ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి గెలవాలంటే కాపు సామజిక వర్గపు ఓట్లతో పాటుగా, రాజు సామజిక వర్గపు ఓట్లు కూడా కావలి. ఆ ప్రాంతం లో కాపులు మరియు రాజుల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి.
2016 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు కాపులు మరియు రాజులు మధ్య ఏ రేంజ్ లో గొడవలు జరిగాయో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.
పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో ఓడిపోవడానికి కూడా కారణం ఇదే అని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ఈరోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండే అవకాశాలు లేవు కాబట్టి దూర ద్రుష్టి తో అలోచించి,
చంద్రబాబు కి కుప్పం, వై ఎస్ జగన్ కి పులివెందుల ఎలా అయితే శాశ్వత సీట్లు అయ్యాయో, అలాంటి సీటు కోసం చూస్తున్నాడు పవన్ కళ్యాణ్.
ఆయన లిస్ట్ కాకినాడ రూరల్, విజయవాడ వెస్ట్ మరియు పిఠాపురం వంటి స్థానాలు ఉన్నాయి. వీటితో పాటుగా తిరుపతి నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నాడు.
మరి ఆయన ఎక్కడ నుండి పోటీ చెయ్యబోతున్నాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.