చంద్రగుప్తుడి ఆస్థానంలో మంత్రిగా పని చేసిన చాణక్యుడు గొప్ప మంత్రిగా కీర్తికెక్కాడు. అతను ఒక శస్ర్తజ్ఞుడు, మంచి వ్యూహకర్త, తత్వవేత్త, ఆర్థిక వేత్త. రాజనీతిజ్ఞుడిగా కూడా ఆయన గుర్తింపు దక్కించుకున్నారు.
చంద్రగుప్తుడు అధికారంలోకి వచ్చేందుకు చాణక్యుడి పథకాలే ప్రధాన కారణం అని ఘంటాపథంగా చెప్పవచ్చు. మొదట చాణక్యుడు నంద రాజు చేతిలో ఘోర అవమానానికి గురవుతాడు.
నందరాజును నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి పథకాలు రచించి ఆయనను ఓడించేలా చంద్రగుప్తుడిని తయారు చేసి చివరికి ఆయనకు పీఠం కట్టబెడతాడు.
బహుముఖ ప్రజ్ఞాశాలి చాణక్యుడు..
చాణక్యుడు సమాజంలోని అన్ని విషయాలను క్షుణ్ణంగా వివరించాడు. రాజకీయ చతురతతో పాటు, భార్యాభర్తల బంధం వరకూ అన్ని విషయాలను వివరించాడు. స్ర్తీలు, పురుషులకు వేర్వేరు ప్రమాణాలు ఉంటాయని చాణక్యుడు వివరించాడు.
జీవితంలో మనం ఏఏ విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటామో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చాణక్యుడు చక్కగా వివరించాడు.
ఎలాంటి వ్యక్తులతో ఎలా నడుచుకోవాలి. శతృవులను ఎలా నాశనం చేయవచ్చో ఆయన వివరించాడు.
పురుషులు తమ వ్యక్తి గత విషయాలను ఎవరి ముందు చెప్పవద్దని చాణక్యుడు సూచిస్తున్నాడు.
అలా చెప్పుకుంటే ఎదుటి వారికి చులకన అవుతామట. అది కుటుంబ సభ్యులైనా, సన్నిహితులైనా అలా చెప్పుకుంటే ఏదైనా ఒక సందర్భంలో మీ విలువను వారు తగ్గిస్తారని చెప్పాడు చాణక్యుడు.
రహస్యాలతో పాటు అవమానాలను కూడా ఎవరికీ చెప్పుకోవద్దట. మనపై కోపం ఉన్న వారికి విషయాలు తెలిస్తే వారి చేతికే కత్తి ఇచ్చినట్లు అవుతుంది అందుకే చెప్పకపోవడమే మంచిది. అందుకే మనకు జరిగిన అవమానాలను ఇతరులతో పంచుకోకపోవడమే ఉత్తమం.
కుటుంబ గొడవలపై బయట వద్దు..
కుటుంబ వ్యవస్థలో దంపతుల మధ్య గొడువలు సాధారణమే. కలహాలు, ఎందుకు, ఎలా వచ్చాయనే విషయాలను దంపతులు ఇద్దరూ ఎవరితో చెప్ప కూడదు. కొందరు వీటిని మరింత జఠిలం చేసి బంధాన్ని విడగొట్టేందకు చూస్తుంటారు.
మరికొందరు వారి జంటను చులకనగా చూస్తారు. అందుకే మన విషయాలను ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. ప్రతి ఒక్కరికీ బలహీనత, బలాలు రెండూ ఉంటాయి. ఈ రెండింటిపై కూడా ఎవరితోనూ చెప్పకూడదు.
తన పర్సనల్స్ ఎవరికీ చెప్పద్దు..
ఒక వ్యక్తి తన విషయాలను ఎలాంటి సమయంలోనూ మరో వ్యక్తికి చెప్పకూడదు. మొదట వారు ఓదార్పుతో అనే మాటలు పర్వాలేదనిపించినా తర్వాత వారు అవే మాటలను అడ్డు పెట్టుకొని మనపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు.
‘శతృవుతకు శతృవు మిత్రుడు.’ ఈ సిద్ధాంతాన్ని చెప్పింది కూడా చాణక్యుడే. మన శతృవులను ఒక కంట కనిపెడుతూనే ఉండాలి.
వారికి శత్రువులు ఉంటే మనం వారిని మిత్రులుగా చేసుకుంటే మన బలం రెట్టింపు అవుతుంది. ఇదే కోణంలో మన శత్రువు కూడా ఆలోచించవచ్చు కాబట్టి మన గురించి మనం మిత్రుడిగా చేసుకున్న వారికి కూడా ఎలాంటి విషయాలు చెప్పవద్దు..