కొంత వయస్సు మీరపడ్డ తర్వాత జుట్టు తెల్లబడడం సాధారణమే. కానీ ఇప్పుడున్న వారిలో కొందరికి చిన్న తనంలో జుట్టు తెల్లబడుతుంది. దీంతో యువకులు కూడా వృద్ధులుగా కనిపిస్తున్నారు.
చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా వెళ్లాలంటే జంకుతున్నారు. ఇరవయ్యో పడిలో 60 సంవత్సరాలుగా కనిపిస్తున్నారు. దీనికి ప్రధాన మైన కారణం వారి ఆహార అలవాట్లే అంటూ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జంక్ ఫుడ్ కు బాగా అలవాటు కావడం. మరికొందరిలో జనటిక్ లోపం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుందని చెప్తున్నారు. ఏది ఏమైనా మంచి ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని సూచిస్తున్నారు.
ఈ మిశ్రమాన్ని ట్రై చేయండి..
తెల్ల జుట్టు వచ్చిన వారు నల్లబడేందుకు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. ఇవన్నీ మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. నల్లబడడం దేవుడెరుగు ఉన్న జుట్టు కూడా రాలిపోతుందని హెచ్చరిస్తున్నారు.
జుట్టు సమస్యలకు ఆయుర్వేధంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఉండవు. ఈ పద్ధతిని ఒక సారి చేసి చూడడండి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఎండిన ఉసిరి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల కలోంజి విత్తనాలను వేసుకొని 4 నిమిషాల పాటు వేయించాలి.
తర్వాత వాటిని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె పోసి వేడి చేసుకోవాలి.
అందులో మనం పొడి చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని వేయాలి. 12 నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత వడబోసి ఒక గాజు సీనాలోకి తీసుకోవాలి.
ఈ నూనెను ప్రతీ రోజు నిద్రపోయే సమయంలో వెంట్రుకలకు పెట్టుకొని పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఉదయం లేవగానే షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది..
వారంలో 2 సార్లు అయినా ఇలా చేస్తే తెల్లజుట్టు మాయం క్రమ క్రమంగా తగ్గుతుంది. దీంతో అదనపు ప్రయోజనాలను కూడా ఈ ఆయిల్ కలిగిస్తుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. చుండ్రును పారద్రోలుతుంది. మరింత దృఢంగా మారుతుంది కూడా.
ఇది ఆయుర్వేదంలో సూచించిన ఒక పరిష్కారం. సాధారణంగా ఆయుర్వేధంతో సైడ్ ఎఫెక్స్ట్ అంతగా ఉండవు కాబట్టి ఈ పద్ధతి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
వీటితో పాటు ప్రతి రోజూ యోగా, ఆసనాలను పాటిస్తే కూడా బ్రెయిన్ కు రక్త సరఫరా పెరిగి జుట్టు ఒత్తుగా, దృఢంగా బాగుంటుందని చెప్తున్నారు.