గొప్పవారు ఏ మాట చెప్పినా అది బుద్ధిమాటే.. వారు చేసే పనుల్లో అంతరార్థం వెతకాలే కానీ ఆరా తీయకూడదు. ఒక వేళ వాటిపై కామెంట్లు చేసినా వారు తేలికగా తీసుకుంటారు. అందుకే వారిని గొప్పవారు అంటారు కదా..
నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావును కూడా ఇండస్ర్టీలో కొంత మంది విమర్శించారు. అయినా వారిని ఆయన పట్టించుకోలేదు.
కానీ జీవితం చివరి అంకంలో మాత్రం నందమూరి రామారావుగా మాత్రం జీవించలేక పోయారు. జీవితం విలువ తెలిసి వచ్చిన తర్వాత వారు అప్పుడు అనుకున్నారట రామారావు ఎంత మేధావో అని.
ఎన్టీఆర్ ను పిసినారి అన్న నటులు..
విశ్వ విఖ్యాత నట సౌర్యభౌముడు నందమూరి బహు పిసినారి.. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టేవారు కాదు.. మెతుకులు రాలితే కాకి తింటుందని.. ఇలా కొంత మంది ఎన్టీఆర్ పై తీవ్రంగా కామెంట్లు చేశారు. వాటి గురించి ఎన్టీఆర్ కు తెలిసినా ఆయన బాధపడలేదు.
ధనం మూలం ఇదం జగత్ అని ఆయనకు తెలుసు. పైసా విలువ ఇప్పుడు కాదు మున్ముందు తెలుస్తుంది అని కొట్టిపారేసే వారు ఎన్టీఆర్. అలా అని అతను నిజంగా పిసినారి కానే కాదు.
అమ్మా అంటూ ఎవరు వచ్చినా కడుపు నింపి పంపించేవారు. ఎంతో మందికి చదువు చెప్పించాడు. చాలా మంది నిర్మాతలకు కూడా ఫ్రీగా సినిమా చేసి ఇండస్ర్టీలో వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకరించారు. ఆయన లాంటి వారిని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడిన వారు జీవితం చివరంలో అధోగతికి చేరారు.
రామారావుపై తీవ్ర విమర్శలు
రామారావు సమకాలీకుడైన రామారావును విమర్శించిన ఒక నటుడు హైదరాబాద్ లో మరణించాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన చికిత్స చేసుకునేందుకు డబ్బులు లేక చాలా నరకం అనుభవించాడు. కనీ ఎన్టీఆర్ కన్నా కూడా గొప్పగా నటించారనే టాక్ మాత్రం ఉంది.
ఇక ఆయన రెమ్యునరేషన్ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదట. పోరాడి మరీ తీసుకునేవారట. ఆయన చివరి రోజుల్లో దౌర్భాగ్య పరిస్థితులు దాపురించారు.
వారందరిదీ అధోగతే..
మరో మహానటి అందరికీ తెలిసిందే. ఆమె కూడా ఎన్టీఆర్ ను విమర్శించారట. ఇంకో కత్తి వీరుడు ఈయన గురించి కొంచెం మాట్లాడుకుందాం.. పిల్లలు ఎదుగుతున్నారు వారి కోసం ఏం కూడబెడుతున్నావు అని ఆయన నాన్నగారు అడిగితే మనదంతా ఫారిన్ స్టయిల్..
ఎవరి జీవితాలు వారివే.. అని చెప్పారు ఆయన. ఇప్పుడు కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. మరో నటీమణి.. ఫారిన్ చెప్పులు..
ఫారిన్ కారుల్లో తిరిగిన ఆమె గురించి నాటి తరానికి తెలుసు. కానీ చివరి రోజుల్లో గుడిమెట్లు కడుగుతూ.. తుడుస్తూ.. గుండెలు పిండేసే కథే ఆమెది.
వీరిలా ఎన్టీఆర్ డబ్బులను వృథా చేయలేదు. అక్కరకు మించి ఖర్చు చేసేవారు కాదు. అలాంటి ఎన్టీఆర్ దాణగుణంలో మాహరాజనే చెప్పాలి. అందుకే చివరి వరకూ దర్జాగా జీవించారు.