సంక్రాంతి వస్తుంది అంటే నందమూరి బాలకృష్ణ సినిమా ఖచ్చితంగా ఉంటుంది అని అతని అభిమానులు ఆశిస్తారు. బాలయ్య సినిమా లేకపోతే పండగ సందడే ఉండదు అంటారు మూవీ లవర్స్. గత సంక్రాంతికి బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద వీరసింహారెడ్డి చిత్రంతో వీర విహారం చేశాడు. దీంతో ఈ సంవత్సరం సంక్రాంతికి కూడా బాలయ్య డాకు మహారాజ్ మూవీతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొడతాడు అని అందరూ భావించారు.
సీతారాం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గత సంక్రాంతికి బాలయ్యతో పోటీపడిన చిరంజీవి వాల్తేర్ వీరయ్య మూవీని అందించిన బాబి ఈసారి బాలయ్యకు గట్టి హిట్టు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మూవీలో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు భారీ రెస్పాన్స్ అందుకున్నాయి.
మరోపక్క మూవీ కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నందమూరి అభిమానులు దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. సంక్రాంతి దగ్గర పడుతుంది అంటే సినిమాల సందడి మొదలవుతుంది.. బరిలోకి భారీ రేంజ్ లో బడా హీరోల సినిమాలు దిగుతాయి. దీంతో గత కొన్ని రోజుల నుంచి సంక్రాంతి బరిలో దిగబోయే సినిమాలపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి.
ఈసారి సంక్రాంతికి రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ తో వస్తున్నాడు. వెంకటేష్ అస్సలు సంక్రాంతికి తగ్గేదే లేదు అంటూ సంక్రాంతికి వస్తున్నామని డిక్లేర్ చేసేశాడు. ఒకపక్క ఈ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నా.. మేకర్స్ మాత్రం కాన్ఫిడెంట్గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో బరి నుంచి బాలయ్య తప్పుకున్నాడు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన అప్డేట్లు అందించారు. ఈరోజుతో షూటింగ్ పూర్తయింది.. సంక్రాంతికి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాం అంటూ అభిమానులలో జోష్ నింపారు. ‘జనవరి 12న పవర్ ప్యాకెట్ మాస్ సంబరాలు మొదలు కాబోతున్నాయి ..”అని క్యాప్షన్ తో బాలయ్యకు సీన్ వివరిస్తున్న డైరెక్టర్ బాబీ ఫోటోని చిత్ర బృందం షేర్ చేసింది. ఇక నాకు మహారాజ్ గెట్ అప్ బాలయ్య ఈ ఫోటోలో వేరే లెవెల్ లో ఉన్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు మూవీ పై అంచనాలను మరింత పెంచుతుంది.