![Screenshot_20250214-192848_Facebook](https://apmessenger.com/wp-content/uploads/2025/02/Screenshot_20250214-192848_Facebook-1024x614.jpg)
విశ్వక్ సేన్ తన సినిమా కెరీర్లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తనదైన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న అతని తాజా చిత్రం **”లైలా”**. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. ఇందులో విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు.
ఈ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా, ఆకాంక్ష శర్మ విశ్వక్ సేన్ సరసన హీరోయిన్గా నటించింది. సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాపై విశ్వక్ సేన్ చాలా కష్టపడ్డాడు. అందుకే ప్రమోషన్స్‌లో కూడా చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. లైలా క్యారెక్టర్ తన కెరీర్లోనే బెస్ట్‌గా నిలుస్తుందని విశ్వక్ అంటున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ తన ప్రేమ అనుభవాల గురించి ఓపెన్ అయ్యాడు. టీనేజ్‌లో మనకు ఎవరి మీదైనా తొలిసారి ఆకర్షణ కలిగితే, దాన్ని సీరియస్ రిలేషన్షిప్ అని భావిస్తామని, కానీ తర్వాత ఆ విషయాన్ని తలచుకుంటే నవ్వొస్తుందని చెప్పాడు. అలా తన జీవితంలోనూ ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగిందని విశ్వక్ చెప్పాడు. అంతేకాక, తనకు నిజమైన ప్రేమ అనుభవం కూడా ఉందని, 24 ఏళ్ల వయసులో ప్రేమలో పడినట్లు, మూడున్నరేళ్ల తర్వాత బ్రేకప్ అయ్యిందని చెప్పాడు. ఆ బ్రేకప్ తనను చాలా బాధపెట్టిందని, అయితే ఆ బాధ నుంచి బయటకు వచ్చిన తర్వాతే తన కెరీర్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టగలిగానని చెప్పాడు.
ప్రేమలో పడిన తర్వాత బ్రేకప్ అనేది చాలా మందికి ఎదురయ్యే అనుభవమే. విశ్వక్ కూడా ఆ దశలో ఎంతో బాధపడ్డాడట. 27 ఏళ్ల వయసులో కూడా కొన్ని సందర్భాల్లో బాధతో ఏడ్చిన రోజులు ఉన్నాయని చెప్పిన అతడు, బాధ కలిగినప్పుడు కంట నీరు పెడితే మనసుకు ఓ రకమైన రిలీఫ్ కలుగుతుందని వెల్లడించాడు. అయితే ఇప్పుడు తన మనసు ఎవరిపైనా ఆసక్తి చూపించట్లేదని, భవిష్యత్తులో ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిన సమయం వస్తే నేరుగా చేసుకుంటానని చెప్పాడు.
సినిమా విషయానికి వస్తే, ఇప్పటివరకు లైలా నుంచి విడుదలైన కంటెంట్ చూస్తే విశ్వక్ ఈ సినిమాకోసం ఎంతగా కష్టపడ్డాడో స్పష్టంగా తెలుస్తోంది. అతడి లేడీ గెటప్ అందరినీ ఆశ్చర్యపరచనుంది. కామెడీ, ఎమోషన్ కలగలిసిన కథలో విశ్వక్ తన స్టైల్లో మరోసారి అలరించనున్నాడు. మరి ఈ సినిమాతో విశ్వక్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.