
రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. ఆయన గురించి ఎవరు గొప్పగా చెబితే ఆశ్చర్యం కలగాలి, కానీ చెడుగా చెప్పితే ఆశ్చర్యపోయే అవసరం ఉండదు. ఎందుకంటే, వర్మ ఎప్పుడూ తనదైన శైలిలో ముందుకు సాగిపోతూ, ఎవరి విమర్శలకూ పెద్దగా స్పందించని వ్యక్తి. తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘శారీ’ ప్రమోషన్ లో భాగంగా వర్మ, ఆరాధ్యలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
ఆరాధ్య ఈ సినిమాలో నటిస్తున్నందున, ఆమెకు రామ్ గోపాల్ వర్మ గురించి పలు అభిప్రాయాలు ఎదురయ్యాయి. వర్మ నుంచి అవకాశం వచ్చిన తర్వాత తన పరిచయ వర్గాల్లో చాలామంది ఆయన గురించి మాట్లాడారని, కొందరు మంచిగా, మరికొందరు చెడుగా చెప్పారని ఆమె తెలిపారు. అసలు వర్మ ఎవరో కూడా తనకు ముందుగా తెలియదని, కానీ ఆయన తనను వెతుకుతున్నారని తెలిసిన తర్వాత తన క్రేజ్ పెరిగిందని చెప్పింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరిగారని పేర్కొంది.
అయితే, కొందరు ఆమెకు వర్మ సినిమాల్లో నటించొద్దని, అతని స్టైల్ ఏంటో చూడమని కొన్ని వీడియోలు పంపారని కూడా వెల్లడించింది. ముఖ్యంగా అషురెడ్డి-ఆర్జీవీ వీడియోను చూపించి, “వర్మ సినిమా చేసేవారు ఇలాగే ఉంటారు, జాగ్రత్త!” అంటూ వారించినట్లు చెప్పింది. కానీ ఆమె వాటిని పట్టించుకోకుండా, వర్మను కలిసిన తర్వాత తన అభిప్రాయం మారిపోయిందని స్పష్టం చేసింది. వర్మ పూర్తిగా క్లారిటీతో కనిపించాడని, షూటింగ్ సమయంలో తనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని తెలిపింది.
వర్మ తన సినిమాల్లో హీరోయిన్లను బోల్డ్‌గా ప్రెజెంట్ చేయడంలో ప్రత్యేక శైలి కలిగిన దర్శకుడు. ఆయన తీసే సినిమాల్లో హీరోయిన్ల అందాలను హైలైట్ చేయడంలో కెమెరా యాంగిల్స్ వేరుగా ఉంటాయి. ఇది ఒక రొమాంటిక్ చిత్రమైనా, సైకలాజికల్ థ్రిల్లర్ అయినా, వర్మ ముద్ర ఉండకమానదు. ‘శారీ’ సినిమాలోనూ ఇదే తరహా స్టైల్ కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమాను గిరీశ్ కృష్ణ కమల్ డైరెక్ట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటేనే ఓ డిఫరెంట్ ట్రాక్. కథలో ఎంతైనా కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తాడు. అందుకే, ‘శారీ’ కూడా ఏదో కొత్తగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాకే అసలు ఇందులో వర్మ ముద్ర ఎంతవరకు ఉందో తెలుస్తుంది.