భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కమల వికాసంతో ఆపసోపాలు పడుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే భారతదేశం.. భారతదేశం అంటే కాంగ్రెస్ అన్నట్టుగా ఉండేది. రాను రాను పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా పెరగడంతో హంగ్ సంస్కృతి పెరిగింది. ఆనక నెమ్మదిగా బీజేపీ బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. కానీ కాంగ్రెస్ మాత్రం మారుతున్న కాలానికి అనుగుణమైన నాయకత్వాన్ని తయారు చేసుకోలేక సతమతమవుతోంది. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవాంటే.. రాజశేఖరరెడ్డి మరణానికి ముందు.. తర్వాత అని చెప్పుకోవాలి.
రెండుసార్లు ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని, అటు కేంద్రంలో కాంగ్రెస్ సాధర్యంలోనే యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రాజశేఖరరెడ్డి పాత్ర మరువలేనిది. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాంగ్రెస్ కేడర్ వైసీపీలో కలిసి పోయింది. తెంగాణ రాష్ట్రంలో మాత్రం ఇందుకు కొంత భిన్నమైన పరిస్థితి ఉంది. అక్కడ కాంగ్రెస్ చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఉనికిని కలిగి ఉంది. ఇప్పటికీ అక్కడ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. అయితే సరైన స్టార్ కాంపెయినర్ లేక టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కోలేక పోతోంది.
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేంత్‌రెడ్డి ప్రస్తుతానికి ఆ పార్టీకి ఆశాదీపంలా కనిపిస్తున్నారు. తెంగాణ పీసీసీ అధ్యక్ష పదవికోసం పలువురు పోటీ చేస్తున్న తరుణంలో రేవంత్‌రెడ్డి కూడా బరిలో నిలిచారు. మిగిలిన నాయకులతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ వంటి యువకుడు, దూకుడు స్వభావం, వాక్పటిమ ఉన్న నాయకుడు తప్పకుండా కావాలి. కొద్దిసేపటి క్రితం యన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిత్వం, స్వభావం వంటివి పరిగణనలోకి తీసుకుంటే నాకు ప్రచార కమిటీ ఛైర్మెన్ పదవే సరిపోతుంది. ఇందుకు నేను కూడా సిద్ధమే అని ప్రకటించారు.