తెలంగాణ లో రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రమాణస్వీకారం కూడా పూర్తి అయ్యి వివిధ ముఖ్యమైన ఫైల్స్ పై కూడా సంతకాలు చేసారు. అలాగే సచివాలయం లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఉన్నటువంటి ఫైల్స్ చాలా వరకు మిస్ అయ్యాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. ఇదంతా ఒక పక్క నడుస్తూనే ఉంది. మరోపక్క రేవంత్ రెడ్డి తన సీఎంఓ కార్యాలయం లో అధికారుల ఎంపిక విషయం పై ప్రత్యేకమైన ద్రుష్టి సారించారు.
ఇప్పటికే సీఎంఓ ముఖ్య కార్యదర్శి గా శేషాద్రి ని రేవంత్ రెడ్డి నియమించాడు. ఇది ఇలా ఉండగా కేసీఆర్ పాలనలో సీఎంఓ ఆఫీస్ లో కీలక అధికారిగా పని చేసిన ఆమ్రపాలి స్మిత సబర్వాల్ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యింది. ఇప్పుడు ఆమెని మళ్ళీ సీఎంఓ ఆఫీస్ కి రప్పించేందుకు కార్యక్రమాలు మొదలయ్యాయి.
టాలీవుడ్‌కు ఇప్పటికీ కేసీఆరే సీఎం
కేసీఆర్ హయం లో ఆమ్రపాలి ఎన్నో కీలకమైన బాధ్యతలను చేపట్టింది. కలెక్టర్ గా ఆమె అందించిన సేవలు గురించి ఎంత చెప్పిన తక్కువే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన కార్యక్రమాలైన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ లలో ఆమ్రపాలి ప్రధాన పాత్ర పోషించారు. అంతే కాకుండా ఇరిగేషన్ శాఖను ఆమె దగ్గరుండి మరీ పరిశీలించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి వరకు ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలవలేదు.
అంతే కాకుండా కేంద్రంలో సర్వీసులు అందించడానికి ఆమ్రపాలి దరఖాస్తు కూడా చేసుకుంది. ఇకపోతే రీసెంట్ గా ఆమె పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ’23 ఏళ్ళ పాటు తెలుగు ప్రజలకు సేవలు అందించే అదృష్టం నాకు కలిగింది. నాపై జనాలు ఇన్ని రోజులు చూపించిన ఈ ఆదరాభిమానాలకు నేను కృతజ్ఞురాలిని. ఇక నుండి కొత్త బాధ్యతలు చేపట్టడానికి సిద్ధం’ అంటూ ఆమె వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ ట్వీట్ అర్థం చూస్తుంటే ఆమె మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రభుత్వం లో పని చేసేందుకు సిద్ధం అయ్యింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఆమెని మళ్ళీ తన సీఎంఓ ఆఫీస్ లో ముఖ్య అధికారిగా పెట్టుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం ఆ పదవి తోనే సరిపెడుతారా? , లేదా మరో కీలక పదవి అప్పగించారా అనేది తెలియాల్సి ఉంది.