మొత్తానికి గత 40 రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ టీచర్స్, వర్కర్స్, ఆయాలు తలపెట్టిన సమ్మె ఆగిపోయింది. మంగళవారం నుంచి అంగన్‌వాడీలు తమ తమ విధుల్లోకి చేరారు.
వేతన పెంపుతో పాటు మరో 11 సమస్యలపై వారు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి సమ్మెకు దిగారు. జీతాల పెంపు ఇందులో ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకుండా మొండి వైఖరితో ముందుకు పోయింది.
ఆఖరికి అంగన్‌వాడీలను ఎస్మా చట్టం కిందకు తీసుకు వచ్చి, వారిని టెర్మినేట్ చేయటానికి కలెక్టర్‌లకు ఉత్తర్వుల కూడా జారీ చేశారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌లో కూడా అంగన్ వాడీలపై చర్యలు తీసుకోవటానికి సిద్ధమైపోయారు.
ఇక్కడే అనుకోని ట్విస్ట్ ఒకటి జరిగింది. తమ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమ్మెను విరమించేదే లేదు అని భీష్మించుకుని కూర్చున్న అంగన్‌వాడీ నేతలు ఉన్నట్టుండి ప్రభుత్వం ఎప్పటి నుంచో చెపుతున్న పాచిపోయిన వాదనలకే తల ఊపి సమ్మె విరమించడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది.
డిమాండ్‌లలో ముఖ్యమైన జీతాల పెంపు అన్నది వచ్చే జులై నుంచి చేపడతాం అని ప్రభుత్వం చెప్పినా వారు ఓకే అన్నారు. జులై నెల అంటే కొత్త ప్రభుత్వం హయాం.
అప్పుడు వైసీపీ వస్తుందో, టీడీపీ కూటమి వస్తుందో ఎవరు చెప్పగలరు. అయినా అంగన్‌వాడీలు ఉన్నట్టుండి ఎందుకు ఇంత మెత్తబడ్డారో తెలియక ప్రభుత్వ పెద్దలు కూడా జుట్టు పీక్కుంటున్నారు.
విశ్వసనీయంగా తెలిసినదాని ప్రకారం అంగన్ వాడీలను తెగే దాకా లాగేలా చేసి, వారి ఉద్యోగాలను టెర్మినేట్ చేసి, వారి స్థానాల్లో వైసీపీ కేడర్‌ను, నమ్మకమైన వాలంటీర్లను నియమించాలని వైసీపీ పెద్దలు స్కెచ్ వేశారు. ఈ మేరకు కేడర్‌కు వివిధ చోట్ల హామీలు కూడా ఇచ్చేశారట.
ఇక మీరు జాబ్‌లో చేరడమే తరువాయి అని చెప్పారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా చాలా మంది సిద్ధం చేసుకున్నారట. అయితే ఈ విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ నేతలు, సమ్మె విరమణ పేరుతో జగన్‌కు రివర్స్ గేమ్ ఆడి ట్రాప్‌లోకి లాగారు.
ఇప్పుడు అంగన్‌వాడీల జాబ్‌లు సేఫ్. మరోపక్క ఈ పోస్ట్‌లు మీవే అని నాయకులు మాట ఇవ్వడంతో పార్టీ కేడర్, వాలంటీర్‌లు సంతోషంలో మునిగిపోయారట.
ఇప్పుడు కథ రివర్స్ అవ్వడంతో వారు నాయకులపై గుర్రుగా ఉన్నారట. ఇలా చివరి నిముషంలో రివర్స్ గేమ్ ఆడి డిమాండ్‌ల సాధనలో ఓడినా.. మరో విధంగా విజయం సాధించారు అంగన్‌వాడీలు.