నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి పరిచయం అక్కర్లేదు సరికాదా.. ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ప్రత్యేక స్లాంగ్, యాక్టింగ్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ ఏ హీరోకు లేని ఫ్యాన్స్ ఒక్క బాలకృష్ణకు మాత్రమే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన ఫ్యాన్స్ లో ప్రముఖులు కూడా ఉన్నారు. అందులో ఏపీ సీఎం జగన్ కూడా ఒకరు. ఆయన చిన్నతనంలో బాలయ్య బాబు సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందేనట. దీనిపై ఇటీవల కొన్నిసార్లు చర్చలు కూడా జరిగాయి.
అఖండతో సెన్సేషనల్ షురూ
కెరీర్ లో కొన్ని రోజులు ఎత్తు పళ్లాలు చూసిన ఆయన ‘అఖండ’తో బాక్సాఫీస్ హిట్ ఇచ్చారు. బోయపాటి శ్రీనివాస్ బాలయ్య కాంబో సెన్సేషనల్ అనే చెప్పాలి. వీరి కాంబోలో ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ హిట్లుగా నిలిచాయి. అఖండ కూడా అంతకు మించి ఆడి వసూళ్ల వర్షం కురిపించింది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘వీరసింహా రెడ్డి’ చిత్రం శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ కోట్ల వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. దీంతో పాటు టీజర్, పోస్టర్, పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక జనవరి 6న ఒంగోలులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా సాగింది.
అట్రాక్షన్ గా నిలిచిన వాచ్
వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య లుక్ చూసిన ఆయన అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సాంప్రదాయం ఉట్టి పడేలా కనిపించిన ఆయనను చూసి ఫ్యాన్స్ సంబుర పడ్డారు. ఈ ఈవెంట్ సాక్షిగా బాలయ్య బాబు మాటలు, ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడయాలో వైరల్ అకూడా అవుతున్నాయి. వ్యూవ్స్ పెరుగుతున్నాయి కూడా. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఈ వెంట్ లో బాలయ్య చేతికున్న వాచీపై అందరి కండ్లు పడ్డాయి.
తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చిన నారా బ్రాహ్మిణి
బాలయ్య చేతికున్న వాచీపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఇది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ వాచీ ధర దాదాపు రూ. 25 లక్షల పైమాటేనట. ఇంత ఖరీదైన వాచీని ఆయనకు ఎవరిచ్చరన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వాచ్ ను బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మణి ఇచ్చిందట. నారా లోకేశ్ కు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు బాలకృష్ణ. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తండ్రి అంటే అందరు కూతుళ్లకూ ప్రత్యేకమనే చెప్పుకోవాలి. తండ్రికి ఇంత ఖరీదైన వాచ్ ను ఇస్తూ తనంటే ఎంత ప్రేమో చాటుకుందట బ్రాహ్మిణి.