నందమూరి బాలకృష్ణ అంటే రికార్డులకు రివార్డులు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వాడు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకొని ఊర మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి.
కానీ ఎన్ని హిట్స్ ఉన్నప్పటికీ ‘నరసింహ నాయుడు’ చిత్రాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోలేరు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు.
అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్!..
టాలీవుడ్ లో ఈ సినిమా అప్పట్లో మొట్టమొదటి 20 కోట్ల రూపాయిల షేర్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అయితే ఈ సినిమా ఒక థియేటర్ లో మాత్రం ఎప్పటికీ చెరిగిపోని రికార్డుని నెలకొల్పింది. ఇక అసలు విషయానికి వస్తే కామావరకు కోట అనే మారుమూల పల్లెటూరిలో ఈ చిత్రం ఏకంగా వంద రోజులు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించింది.
ఆ థియేటర్ లో ఈ సినిమా కేవలం పది రూపాయిల టికెట్ రేట్స్ మీద నడిచింది. ఆ పది రూపాయిల టికెట్స్ తోనే ఈ సినిమా ఆ థియేటర్ లో దాదాపుగా 10 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది అట. ఇది అప్పట్లోనే కాదు, ఇప్పటికీ కూడా ఆల్ టైం రికార్డు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
10 యూపాయిల టికెట్ రేట్స్ మీద అప్పట్లోనే 10 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది అంటే, ఇప్పటి టికెట్ రేట్స్ ప్రకారం ఎంత వసూళ్లను రాబట్టి ఉండచ్చో మీరే ఊహించండి. బాలయ్య నటించిన చాలా సినిమాల వరకు ఇలాగే సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించాయి.
సింహా, లెజెండ్ మరియు అఖండ వంటి చిత్రాలకు కూడా ఇలాంటి అన్ బీటబుల్ రికార్డ్స్ ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఈ రికార్డ్స్ దరిదాపుల్లోకి కూడా ఏ హీరో రాకపోవడం విశేషం. ప్రస్తుతం బాలయ్య ఉన్న ఫామ్ లో మళ్ళీ ఈ రికార్డ్స్ ని ఆయన బద్దలు కొట్టుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.