అధికార వైసీపీ పార్టీ లో అత్యంత కీలకమైన ముఖ్య నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి. వరుసకు ఈయన ముక్యమంత్రి జగన్ కి మామ అవుతాడు. అధికారం లోకి రాగానే బాలినేని కి మంత్రి పదవి కూడా ఇచ్చాడు జగన్. అయితే ఈమధ్య బాలినేని ముఖ్యమంత్రి పని తీరుపై, వైసీపీ పార్టీ పై చురకలు అంటించడం మనమంతా చూస్తూనే ఉన్నాం. అంతే కాదు త్వరలోనే ఈయన పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేనలో చేరబోతున్నాడని తెలుస్తుంది.
అందుకే పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు అండతో ఒంగోలు రాజకీయాలను శాసిస్తా అని తన అనుచరులతో చెప్పినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో జగన్ సిట్టింగ్ ఎమ్యెల్యే లకు కాకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని, అందువల్ల బాలినేని కి సీట్ దక్కకపోవచ్చు అని, అందుకే జనసేన పార్టీ లో చేరబోతునట్టుగా వార్తలు వినిపించాయి. దీనిపై బాలినేని నుండి ఇప్పటి వరకు నో రెస్పాన్స్.
రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా
అయితే ఆయన రీసెంట్ గా జరిగిన కొన్ఫెషన్ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఎమ్యెల్యే గా నేను నా నగర ప్రజలకు నిజాయితీ తో కూడిన పాలన అందించాను. జనాల నుండి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు. అలా అని నేను పూర్తిగా నిజాయితీ పరుడు అని చెప్పుకొను, మంత్రిగా ఉన్నప్పుడు కొంత డబ్బులు తిన్నాను. మీరంతా నాకోసం బలంగా నిలబడితే మళ్ళీ పోటీ చేస్తాను, లేకపోతే ఒక మంచి మనిషి ఇమేజితో రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటాను, నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
అంటే దీనర్థం జగన్ తో మళ్ళీ నన్ను ఈ ప్రాంతానికి ఎమ్యెల్యే చేయాల్సిందిగా ఒత్తిడి చెయ్యండి, లేకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటా అని తన పార్టీ ముఖ్య నాయకులకు పరోక్షంగా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఏదైనా సర్వేల తర్వాతే జగన్ నిర్ణయం తీసుకుంటాడు. సర్వే లెక్కల ప్రకారం బాలినేని కి ఒంగోలు ప్రజల నుండి మంచి మార్కులే పడుతాయని అందరూ అనుకుంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. వైసీపీ మరియు టీడీపీ- జనసేన పార్టీల మధ్య ప్రధాన పోరు ఉంది. ఈ రెండిట్లో ఏది గెలుస్తుందో చూడాలి.