తెలంగానలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానుల ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ముఖ్యంగా బండ్ల గణేష్ వంటి వీరాభిమానుల విషయమైతే ఇక చెప్పక్కర్లేదు.
ఎన్నికలకు ముందే బండ్ల గణేష్ అనేక మీడియా సంస్థలతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించబోతోంది. ఇది పక్కా..
నా మాటను ఫీడ్ చేసి పెట్టుకోండి, రాకపోతే నన్ను అడగండి అంటూ ఘంటాపధంగా చెప్పాడు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అంతే కాదు..
బండ్లకు సన్నిహితుడైన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. దీంతో బండ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న తరుణాన్ని పురస్కరించుకుని ఓ ప్రెస్మీట ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తన మాటలతో వీరవిహారం చేశారు.
బీఆర్ఎస్ నాయకుల్ని ఏకిపారేశారు… ‘‘తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి రేవంత్రెడ్డి గారు. ఈ నెల రోజుల్లో తెలంగాణలో జరిగిన పరిణామాలు చూస్తున్నారుగా.. ఇది స్వేచ్ఛ అంటే.. ఇది సమానత్వం అంటే..
ఇది కదా సోనియమ్మ కోరుకున్న బంగారు తెలంగాణ. ఇలాంటి తెలంగాణను నిర్మిస్తామని చెప్పి మొత్తం దోచుకు తిన్నారు బీఆర్ఎస్ నేతలు. రాజ్యాంగం అంటే గౌరవంలేదు..
రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ అంటే లెక్కలేదు. మీరే ఒక సెపరేట్ రాజ్యాంగాన్ని రచించుకున్నారు. ఒక్క దెబ్బకు ప్రజలు మీ కోటలు కూల్చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మీరు చూపించేది ఏమీ లేదు. ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా బీఆర్ఎస్ విజయం సాధించదు.
రాసి పెట్టుకోండి. నిజంగా మీకు అంత నమ్మకం ఉంటే బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయండి.
గత పది సంవత్సరాలుగా ఢల్లీి పీటం మీద ఉన్న వారితో అంటకాగి ఇప్పుడు పార్లమెంట్ స్థానాలతో ఏదో చేస్తారట. ఏరోజైనా ప్రజల సమస్యలపై ఢల్లీికి వెళ్లారా?
ఎంత సేపు మీ బిడ్డ కేసులు, మీ రహస్య మంతనాలు ఇవేగామీరు వెలగబెట్టింది అంటూ రెచ్చిపోయారు.