మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో రాజకీయ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.
వైసీపీ కంటే ఇప్పుడు ఎక్కువగా టీడీపీ పార్టీ మీదనే ఒత్తిడి ఏర్పడింది. ఒకపక్క పొత్తులో ఉన్న జనసేన పార్టీ కి సీట్ల సర్దుబాటు చెయ్యాలి. మరో పక్క పార్టీ లో సీట్లు దక్కని అభ్యర్థులను బుజ్జగించాలి.
లేకపోతే అస్సమ్మతి సెగలు రగులుతాయి. సంక్రాంతికి లేదా , ఈ నెలాఖరు లోపు జనసేన ఎన్ని స్థానాల నుండి పోటీ చేయబోతుంది అనేది ఖరారు అయిపోతుంది. తక్కువ స్థానాలు ఇస్తే ఓటు బదిలీ అవ్వదు అనే భయం టీడీపీ లో ఉంది.
ప్రస్తుతం ఈ విషయమై టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ తరచూ చర్చలు చేస్తూనే ఉన్నారు. ఇద్దరు కూడా వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ పరిస్థితి పై ఆరాలు తీస్తూ, ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్నారు.
ఇది ఇలా ఉండగా త్వరలోనే చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డ కి విచేయబోతున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఆళ్లగడ్డ లో ఈసారి భూమా అఖిల ప్రియకి టికెట్ దక్కే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్థానం పొత్తులో భాగంగా జనసేన కి వెళ్లే అవకాశం ఉంది.
అందుకే అఖిల ప్రియ కి గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. మరో పక్క అఖిల ప్రియ తనకి ఎమ్యెల్యే సీట్ ఖరారు చెయ్యకపోతే చంద్రబాబు ఆళ్లగడ్డ సభకి డబ్బులు ఖర్చు చెయ్యను అని తెగేసి చెప్పింది.
మూడు నెలల క్రితం నంద్యాల లో జరిగిన చంద్రబాబు సభకి భూమా బ్రహ్మానంద రెడ్డి తో డబ్బులు ఖర్చు చేయించి,చివరికి మాజీ మంత్రి ఎంఎండీ ఫరూక్ కి టికెట్ కేటాయించారు.
అలా నాకు కూడా చేస్తే నా పరిస్థితి ఏంటి?..నాకు సొంతం కానీ టికెట్ కోసం నేనెందుకు సభకి 60 నుండి 70 లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలు అవ్వాలి అంటూ భూమా అఖిల ప్రియ అంటుంది అట. మరి చంద్రబాబు ఆమెకి ఎలాంటి హామీ ఇస్తాడో చూడాలి.