గత నెల రోజుల నుండి టీవీ లలో తన కొడుకు రోషన్ హీరో గా నటించిన ‘బబుల్ గమ్’ సినిమాని ప్రమోట్ చెయ్యడం చెయ్యడం లో క్షణకాలం తీరిక లేకుండా లేకుండా గడుపుతుంది యాంకర్ సుమ.
కుర్రాడు చాలా యావరేజ్ గా ఉన్నాడు, ఇతను ఏమి హీరో అని అనుకున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత, పర్లేదు, కుర్రాడిలో యాక్టింగ్ టాలెంట్ ఉంది.
డైలాగ్ డెలివరీ బాగుంది, హావాభావాలు కూడా చాలా చక్కగా పండిస్తున్నాడు అని అనుకున్నారు ఆడియన్స్. డైరెక్టర్ కూడా చిన్నోడేమి కాదు.
గతం లో ఆయన క్షణం మరియు ‘కృష్ణ & హిస్ లీల’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. కాబట్టి కచ్చితంగా మినిమం గ్యారంటీ ఔట్పుట్ ఇస్తాడని ఆడియన్స్ అనుకున్నారు. అలా పాజిటివ్ బజ్ తో నిన్న విడుదలైన ఈ సినిమాకి పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చింది.
కథ విషయానికి వస్తే ఆది అనే హైదరాబాద్ లో నివసించే మధ్యతరగతి కుర్రాడికి పెద్ద డీజీ అవ్వాలని కోరిక ఉంటుంది.
పలు పబ్బులలో ఆయన డీజే గా పనిచేస్తూ ఉంటాడు. అలా ఒక పబ్ లో పార్టీకి వచ్చిన జాన్వీ అనే అమ్మాయి ని చూసి ప్రేమలో పడుతాడు. ఆ అమ్మాయి కూడా ఆది వేసే డీజే కి ఫిదా అయిపోతుంది. అలా అతనితో స్నేహం చెయ్యడానికి ఇష్టపడుతుంది,
ఆ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. అలా వీళ్లిద్దరి లవ్ స్టోరీ జరుగుతుండగా, ఒకరోజు పార్టీ లో జాన్వీ కి సంబంధించిన ఫ్రెండ్ కారణంగా పెద్ద గొడవ జరుగుతుంది. ఈ గొడవకి నొచ్చుకున్న జాన్వీ ఆది ని చాలా ఘోరంగా అవమానిస్తుంది.
ఆ అవమానం తట్టుకోలేక ఆది ఎలా అయినా పెద్ద డీజే అవ్వాలని చూస్తాడు, ఆ తర్వాత ఏమైంది?, డీజే అయ్యాడా లేదా?, జాన్వీ తో మళ్లీ ప్యాచప్ అయ్యాడా లేదా అనేది మిగిలిన స్టోరీ.
సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసిన , సెకండ్ హాఫ్ మాత్రం మంచి బావోద్వేగపూరితమైన డైలాగ్స్ తో డైరెక్టర్ చాలా చక్కటి స్క్రీన్ ప్లే అందించాడు.
రోషన్ కూడా చాలా అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఇక సెకండ్ హాఫ్ మొత్తానికి హీరోయిన్ మానస చౌదరి మెయిన్ పిల్లర్ లాగ నిల్చింది. ఓవరాల్ ఒక డీసెంట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా, టైం పాస్ కోసం వీకెండ్ లో ఒకసారి చూడొచ్చు.