2024 వ సంవత్సరం వచ్చేసింది..మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు రసవత్తరంగా మారింది. వైసీపీ ప్రభుత్వం స్థాపించినప్పుడు ఇక పదేళ్లు జగన్ సీఎం గా ఉంటాడు అనే రేంజ్ వేవ్ ఉండేది.
కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో, అప్పటి నుండి పరిస్థితులు మొత్తం మారిపోయాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుంది. జగన్ ఇస్తానన్న హామీలు ఒక్కటి కూడా ఇవ్వలేదు.
మహిళలకు సంబంధించిన స్కీమ్స్ బాగానే ఇస్తున్నాడు కానీ, మిగిలిన అన్నీ రంగాలకు న్యాయం చెయ్యలేకపోయాడు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏమిటి అని ఎవరినైనా అడిగితే ధైర్యం ఇది మా రాజధాని అని చెప్పలేని దుస్థితి.
దీని వల్ల వైసీపీ పై తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. పెద్ద పెద్ద సర్వేలు సైతం వచ్చే ఎన్నికలలో టీడీపీ – జనసేన కూటమి అధికారం లోకి వస్తుందని అంటున్నారు. అయితే జగన్ తానూ ఎలా అయినా వచ్చే ఎన్నికలలో గెలవాలి అనే కసితో ఉన్నాడు.
ఆ కసికి తగ్గుట్టుగానే అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నాడు. సర్వేల ద్వారా అభ్యర్థులను కుల వర్గాల ఓట్లను దృష్టిలో పెట్టుకొని సీట్లు కేటాయిస్తున్నాడు.
ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ని విడుదల చేసిన సీఎం జగన్, త్వరలోనే రెండవ జాబితా విడుదల చెయ్యబోతున్నాడు. ఈ జాబితా జనవరి నెలాఖరున విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే 15 నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జిలను నియమించాడు జగన్.
దాదాపుగా వీళ్ళే వచ్చే ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చెయ్యొచ్చు. మరో పక్క చంద్రబాబు జగన్ విడుదల చెయ్యబొయ్యే రెండవ జాబితా కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఈ జాబితా లో ఉన్న అభ్యర్థుల లిస్ట్ ని చూసి ఆ అభ్యర్థుల బలాబలాలు ఆధారంగా ఎన్నికల్లో తమ అభ్యర్థులను రెడీ చెయ్యడానికి సిద్ధం అవుతున్నాడు చంద్రబాబు.
మరోపక్క జనసేన పార్టీ కి కూడా సీట్ల కేటాయింపు జరగాలి. అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 50 నుండి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని రాజకీయ వర్గాల నుండి జోరుగా సాగుతున్న చర్చ.
ఇప్పటికే ఈ రెండు పార్టీల్లోనూ వైసీపీ నుండి చేరికలు జోరు అందుకున్నాయి. పెద్ద పెద్ద ఇంచార్జిలు మరియు ఎమ్యెల్యే అభ్యర్థులు ఈ కూటమి లో చేరుతున్నారు. చూడాలి మరి జగన్ వ్యూహాలు ఫలిస్తాయా, లేదా చంద్ర బాబు – పవన్ కళ్యాణ్ ఎత్తులు ఫలిస్తాయా అనేది రాబొయ్యే రోజుల్లో.