చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెద్ద చిక్కులో పడ్డాడు అనే చెప్పాలి.. ఒకపక్క తన సొంత పార్టీ నాయకులను మరియు క్యాడర్ ని సముదాయించాలి, మరోపక్క జనసేన పార్టీ నేతలు మరియు క్యాడర్ ని సముదాయించాలి.
ఎటు బోల్డ్ స్టెప్ తీసుకున్న చంద్రబాబు కి నష్టమే. రాజకీయాలు అన్న తర్వాత పొత్తులు సహజం, కానీ టీడీపీ – జనసేన పొత్తు మాత్రం సాధారణమైన పొత్తు కాదు.
ఏమాత్రం తేడా జరిగినా పెద్ద రచ్చ జరుగుద్ది. టీడీపీ మీడియా కి సంబంధించిన వాళ్ళు జనసేన కి కేవలం 22 స్థానాలు మాత్రమే ఇచ్చారని ప్రచారం ప్రచారం చేస్తున్నారు.
మరోపక్క జనసేన క్యాడర్, మరియు కాపు సంఘాలు 60 స్థానాలకు ఒక్క సీట్ తగ్గినా ఓటు బదిలీ అవ్వదు, మేమెవ్వరిరం టీడీపీ కి ఓటు వెయ్యం, జనసేన లేని చోటు బీజేపీ కి వేస్తాం, లేకపోతే నోటా కి వేస్తాం అని అంటున్నారు.
ఎన్నికల్లో అధికారం లోకి రావాలంటే కచ్చితంగా జనసేన పార్టీ ఓట్లు కీలకం అనేది సర్వేలు సైతం చెప్తున్నాయి. గత ఎన్నికలలో 7 శాతం ఓట్లే వచ్చాయి కదా,
అంత బిల్డప్ ఆ పార్టీ కి ఇవ్వడం అవసరమా అని తెలుగు దేశం పార్టీ క్యాడర్ అనుకుంటే పప్పులో కాళ్ళు వేసినట్టే. అప్పుడు జనసేన పార్టీ అసలు విన్నింగ్ రేస్ లో లేదు, పార్టీ కి అప్పట్లో కనీసం ఇంచార్జీలు కూడా లేరు.
హడావడి గా పోటీ చేసి, సీఎం రేస్ లో పవన్ కళ్యాణ్ లేదు అని అందరికీ అర్థం అయినప్పటికీ కూడా, తమ ఓటు వేస్ట్ అవుతుంది అని ఆలోచించకుండా పాతిక లక్షల మంది ఓట్లు వేశారు.
గెలవడు, సీఎం అయ్యే సమస్యే లేదు అని అనిపించిన రోజుల్లోనే అన్ని ఓట్లు వచ్చాయంటే, ఒక్కసారి గెలుస్తుంది, ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది అనే ఊపు ఉన్నప్పుడు ఏ రేంజ్ ఓట్లు నమోదు అవుతాయో ఊహించుకోవచ్చు.
సర్వేల ప్రకారం, అలాంటి సందర్భం ఉన్నప్పుడు జనసేన పార్టీ ఓటు షేర్ ఆంధ్ర ప్రదేశ్ మొత్తం మీద 20 శాతం కి పైగా ఉంటుంది. కాబట్టి జనసేన ని తక్కువ అంచనా వెయ్యడానికి వీలు లేదు.
అందుకే టీడీపీ జనసేన కి 55 సీట్లు కేటాయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి, అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ని రెండేళ్ల పాటు ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా చేయబోతుంది అనే టాక్ ఉంది.
ఒకవేళ జరిగితే టీడీపీ లో కలహాలు రావొచ్చు, వాళ్ళు వ్యతిరేకించొచ్చు, కాబట్టి చంద్రబాబు పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైంది.