
జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వర్ష, ఇమ్మాన్యుయేల్ జంటకు ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరి మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ సహా పలు షోలలో వీరిద్దరూ తమ మధ్య ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. బయట కూడా ఒకరిపై ఒకరు తమ అనుబంధాన్ని పలు సందర్భాల్లో బయట పెట్టారు. తాజాగా వర్ష చేసిన ఓపెన్ ఛాలెంజ్ చర్చనీయాంశమైంది. “నేను పతివ్రతనే.. కాదంటే అగ్నిగుండంలో దూకుతా” అని చెప్పడం వైరల్‌గా మారింది. దీనికి రష్మీ ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ మరింత ఆసక్తిని రేకెత్తించింది.
తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన షో జబర్దస్త్. దాదాపు 12 సంవత్సరాలుగా ఈ షో టాప్ రేటింగ్స్‌లో కొనసాగుతోంది. ఎన్నో కొత్త కళాకారులను పరిచయం చేసి, వారికి మంచి గుర్తింపు తీసుకువచ్చిన ఈ షో, ఇప్పటికీ కామెడీ లవర్స్‌కి ఎప్పుడూ ప్రత్యేకమైనది. ఈ షో ద్వారా ఫేమస్ అయిన ఇమ్మాన్యుయేల్, వర్ష జంట ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, స్కిట్స్‌లో చూపించే ప్రేమభావం, వీరి ఆఫ్‌స్క్రీన్ బాండ్ వల్ల గాసిప్స్ మరింత పెరిగాయి.
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన తాజా ప్రోమోలో వర్ష, ఇమ్మాన్యుయేల్ చేసిన స్కిట్ హైలైట్‌గా నిలిచింది. మొదట నూకరాజు, తాగుబోతు రమేశ్ తమ కామెడీతో అందరినీ నవ్వించగా, పటాస్ ఫైమా టీంతో వచ్చిన స్కిట్ కూడా మంచి వినోదాన్ని అందించింది. ఫైమా తనదైన స్టైల్లో టీ తెమ్మని అడగగా, టీ అంటే క్యాపిటల్ టీనా, లేక స్మాల్ టీనా అని ప్రశ్నించడం కడుపుబ్బా నవ్వించింది. బుల్లెట్ భాస్కర్‌ను పెళ్లి చేసుకుంటానంటూ ఫైమా చేసే కామెడీ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
వర్ష, ఇమ్మాన్యుయేల్ స్టేజ్ పైకి వచ్చి, తాము మొగుడు-పెళ్లాలమంటూ స్కిట్ స్టార్ట్ చేశారు. “నీతో స్కిట్ చేస్తుంటే ఏదో కొత్త కొత్తగా ఉంది” అని వర్ష అంటుండగా, “కొత్త రుచులు మరిగాక కొత్తగానే ఉంటుంది” అంటూ ఇమ్మాన్యుయేల్ రిప్లై ఇచ్చాడు. వీరి మధ్య ప్రేమ, అనుబంధం, స్కిట్లో చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వర్ష మాట్లాడుతూ, తన ఇంటి ఎదురుగా ఉన్న శివాజీ గారు రోజూ పాల ప్యాకెట్ కోసం బయటకు వస్తారని, కానీ, ఆయనను చూడలేదని చెప్పింది. దీంతో కుష్బు “కానీ చిన్న టవల్ మాత్రం చూసావా?” అంటూ సరదాగా ప్రశ్నించింది.
దీంతో వర్ష “నన్ను అనుమానిస్తున్నారా? ఇక్కడ నిప్పుల గుండం వేయండి.. దూకి పతివ్రతలా లేచొస్తా” అని సీరియస్‌గా చెప్పగా, వెంటనే రష్మీ “కాలిపోతావే” అంటూ ఫన్నీ పంచ్ వేసింది. చివరగా ఇమ్మాన్యుయేల్ “ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నా భార్య అవుతుంది” అని చెప్పడంతో నవ్వుల వర్షం కురిసింది. ఈ స్కిట్ మొత్తంగా ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.