యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనం ఎలాంటిదో మనం ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం. విడుదలై ఇప్పటికి 5 రోజులు అయ్యింది.
ఈ 5 రోజుల్లో ఈ చిత్రం మన టాలీవుడ్ స్టార్ హీరోలందరి క్లోసింగ్ కలెక్షన్స్ ని దాటేసి నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం నిలుస్తుందా లేదా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో ఉండేది.
నైజాం ప్రాంతం లో ‘సలార్’ బీభత్సం..డేంజర్ లో పడ్డ #RRR రికార్డ్స్!
కానీ నిన్న వర్కింగ్ డే నాడు ఈ చిత్రం దుమ్ము లేపేసింది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే కాదు, హిందీ వెర్షన్ కూడా నిన్న ఈ చిత్రం అదరగొట్టేసింది.
విచిత్ర ఏమిటంటే బాలీవుడ్ లో అనేక మేజర్ సిటీలలో సలార్ హిందీ వెర్షన్ షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ చిత్రం వసూళ్లను అధిగమించేసింది. ఇది బాలీవుడ్ ట్రేడ్ కి కూడా పెద్ద షాక్.
ఓవర్సీస్ లో క్రిస్మస్ నాడు వసూళ్లు ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటాయి, సలార్ చిత్రం కూడా క్రిస్మస్ పండుగని సరిగ్గా ఉపయోగించుకుంది.
క్లోసింగ్ లో అయినా 7 మిలియన్ డాలర్ల వసూళ్లు వస్తాయా అని అనుకునేవారు మొన్నటి వరకు. కానీ ఈ సినిమా క్రిస్మస్ సెలవలు పూర్తి అయ్యేలోపే 7 మిలియన్ డాలర్ల మార్కుని దాటేసింది.
కేవలం హిందీ వెర్షన్ వరకు ఈ చిత్రానికి నార్త్ అమెరికా మరియు కెనడా కలిపి 1 మిలియన్ కి పైగా డాలర్లు వచ్చాయి.
ఒక తెలుగు సినిమా హిందీ దబ్ వెర్షన్ కి ఇంత వసూళ్లు రావడం రాజమౌళి సినిమాల తర్వాత ప్రభాస్ సలార్ కి మాత్రమే జరిగింది.
ఓవరాల్ గా చూసుకుంటే సలార్ చిత్రానికి 5 రోజులకు కలిపి 430 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
వర్కింగ్ డేస్ లో కూడా చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి కాబట్టి, ఫుల్ రన్ లో ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుంది అనే ఆశలు ప్రభాస్ అభిమానులు ఇప్పటికీ పెట్టుకోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
హిందీ లో కూడా వసూళ్లు స్టడీ గా ఉన్నాయి. తొలుత హిందీ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అనుకున్నాం. కానీ ఊపు చూస్తూ ఉంటే బ్రేఅక్వేం మార్క్ దాటి కేవలం హిందీ వెర్షన్ నుండి 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తాయని అంటున్నారు.