నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సెట్స్‌లోకి అడుగుపెడితే పూర్తిగా దర్శకుడి చెప్పినదే చేయడం, ఆయన విజన్‌కు పూర్తి స్థాయిలో అనుకూలంగా వ్యవహరించడం ఆయన ప్రత్యేకత. సెట్లో క్రియేటివ్ సలహాలు ఇవ్వకుండా దర్శకుడి మార్గదర్శనానుసారమే నటిస్తూ కథను ముందుకు తీసుకెళతారు. ఇలాంటి తత్వంతోనే బాలయ్య వరుస విజయాలను అందుకుంటున్నారు.
తాజాగా ఆయన బాబి దర్శకత్వంలో నటించిన **’డాకు మహారాజ్’** సినిమా కోసం ఎంతగా శ్రమించారో తెలుసుకుంటే బాలయ్య పనితనం, కమిట్‌మెంట్‌కి మళ్లీ మరోసారి ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సినిమా కోసం డూప్ లేకుండా అన్ని యాక్షన్ సన్నివేశాలను స్వయంగా చేసినట్టు బాబి ముందే వెల్లడించారు. అయితే, ఈ సినిమా షూటింగ్‌లో ఒక ప్రత్యేక సన్నివేశం గురించి చెప్పిన విషయాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
“రాజస్థాన్‌లో మండే ఎండల్లో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాం. ఆ సీన్‌లో కాలుతున్న కట్టెల మధ్య బాలయ్య నటించాల్సి వచ్చింది. అక్కడి తీవ్ర వేడిని తట్టుకోవడం చాలా కష్టమైనప్పటికీ, బాలయ్య ఏమాత్రం వెనుకడగవేయకుండా సీన్ పూర్తి చేశారు” అని బాబి పేర్కొన్నారు. బాబి చెప్పినట్టుగా, ఆ సమయంలో బాలయ్య నటన చూస్తే ఆయన ఎంతగా సినిమాను ప్రేమిస్తారో అర్థమవుతుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో సెగ తట్టుకోలేకబోయిన బాబి, అదే సమయంలో బాలయ్య మాత్రం రెప్పపాటు వేయకుండా నటించడమే కాకుండా, తన కళ్లలోనే ఆగ్రహాన్ని చూపించారని చెప్పారు.
ఇక గుర్రాల సన్నివేశాలు కూడా డూప్ లేకుండా చేయడం బాలయ్య ప్రత్యేకత. ఈ సినిమా షూటింగ్‌లో ఆయన ఓ మొండి గుర్రాన్ని అదుపు చేస్తూ కొన్ని సన్నివేశాలు చేసిన తీరు చూసి బాబి షాక్ అయ్యారట . ఈ అనుభవాలన్నీ బాలకృష్ణ ఎంతటి సమర్పణతో నటన పట్ల వ్యవహరిస్తారో చాటి చెప్పుతున్నాయి. బాబి మాటల్లోనే, బాలయ్య సినిమా, నటన అంటే ఎంతో అభిమానం అన్న విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది.
సంక్రాంతి సంబరాలకు డాకు మహారాజ్ లా బాక్సాఫీస్ ని కొల్లగొట్టడానికి వచ్చిన బాలయ్య, మరోవైపు, బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ తావడం’చిత్రంలో నటిస్తున్నారు . అఖండ మొదటి భాగం అందుకున్న విజయం తర్వాత, ఈ మూవీ లో బాలకృష్ణ శివ తాండవం ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.