
ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలకు లక్కీ హీరోయిన్గా మారినట్లు అనిపిస్తోంది. ఆమె నటించిన బాలకృష్ణ సినిమాలు వరుస విజయాలు సాధించడంతో ఈ ట్యాగ్ వచ్చింది. ‘అఖండ’లో నటించి భారీ హిట్ అందుకున్న ప్రగ్యా, తాజాగా సంక్రాంతి రేసులో విడుదలైన ‘డాకూ మహారాజ్’లో కూడా బాలకృష్ణ సరసన నటించి విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా ఆమె తన నటనతో మెప్పించింది. ఇప్పటివరకు ‘అఖండ,’ ‘వీర సింహారెడ్డి,’ ‘భగవంత్ కేసరి,’ ‘డాకూ మహారాజ్’ వంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో 1991 జనవరి 12న జన్మించిన ప్రగ్యా, భారతీయ మోడల్‌గా తన కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత 2015లో క్రిష్ దర్శకత్వం వహించిన ‘కంచె’తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన ఆమెకు ఫిలిం ఫేర్ ఉత్తమ డెబ్యూ హీరోయిన్ అవార్డు లభించింది. ‘కంచె’ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ప్రగ్యా, తర్వాత ‘ఓం నమో వెంకటేశాయ,’ ‘జయ జానకి నాయక,’ ‘గుంటూరోడు,’ ‘నక్షత్రం,’ ‘ఆచారి అమెరికా యాత్ర,’ ‘సైరా,’ ‘అఖండ’ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ‘అఖండ 2’లో కూడా ఆమె బాలకృష్ణ సరసన నటిస్తోంది.
సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వంటకాల విశేషాలు, వ్యక్తిగత అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది.
ఆర్థికంగా కూడా ప్రగ్యా జైస్వాల్ ఎంతో స్థిరంగా ఉంది. సినిమాలు, మోడలింగ్ అసైన్మెంట్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా సంవత్సరానికి రూ. 7 నుంచి 8 కోట్లు సంపాదిస్తోంది. ఆమె ఇప్పటివరకు రూ. 50 కోట్లకుపైగా ఆస్తులు కూడగట్టినట్టు సమాచారం. ప్రగ్యా వద్ద లగ్జరీ కార్లు, ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కూడా ఉన్నాయి. తన ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ, జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకర్షిస్తోంది.
తాజాగా ‘డాకూ మహారాజ్’ విడుదలైన రోజే ప్రగ్యా పుట్టినరోజు జరగడం, ఈ సినిమా హిట్ కావడం ఆమెకు అదృష్టంగా మారింది. ఈ విజయంతో ప్రగ్యా కెరీర్లో మరిన్ని అవకాశాలు వస్తాయా లేదా అనేది చూడాలి.