పెద్దవాళ్లు ఎప్పుడూ చెప్తుంటారు. విడిచిన బట్టు వేసుకోవద్దని, కనీసం వాటిని ఒక్కసారైనా నీటిలో ముంచి తీయాలని సూచస్తారు. పెద్దల మాటలు ఎప్పుడూ ముందు చూపు దూరుదృష్టితో ఉంటుందని మనందరికీ తెలిసిందే.
అయితే అందులో సంప్రదాయంగా కొన్ని విషయాలు దాగుంటే, శాస్త్రీయంగా కూడా మరికొన్ని దాగున్నాయి. అవేంటో చూద్దాం..
ధరించినవే మళ్లీ.. మళ్లీ.. ధరించవద్దు
ఇప్పటికీ చాలా మంది విడిచిన బట్టలు మాసిపోలేదని సాకుగా చూపించి వాటినే ధరిస్తారు. వీటితో పాటు నైట్ వేర్ (రాత్రి వేసుకునే) బట్టలు మగళవాళ్లయితే నైటీ ఫ్యాంట్, బాక్సర్, షాట్ లాంటివి,
ఆడవాళ్లయితే నైటీల వంటిని రోజుల తరబడి వాడుతుంటారు. ఎక్కువ ఉతికితే వాటి లైఫ్ తొందరగా ముగుస్తుందని కూడా ఒక కారణం చెప్తారు. ఇలా విడిచిన బట్టలను ఉతకకుండా,
కనీసం నీటిలో నుంచి తీయకుండా వేసుకుంటే ఏమవుతుంది అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే..
నైట్ వేర్ విషయంలో ఇది తప్పనిసరి
రాత్రి పూట ధరించిన నైటీవేర్ బట్టలను మళ్లీ వేసుకోవద్దని, ఒక వేళ వేసుకున్నా కనీసం నీటిలో ముంచైనా తీయాలి. దీంతో పాటు రోజు వారి (క్యాజువల్) డ్రెస్సులను కూడా ప్రతీ రోజూ ఉతికి ఆరబెట్టిన తర్వాత ఇస్త్రీ కొట్టి మరీ ధరించాలట.
ఇది పూర్వీకులు సైతం చెప్పారు. ఇలా వేసుకున్న బట్టలే వేసుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఫాం అయి మనపై ప్రభావం చూపుతుందని పెద్దలు సూచనలు చేస్తున్నారు.
ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపు..
ఆడవాళ్ల పట్టు చీరల విషయంలో కూడా చాలా మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. పట్టుచీర అంటేనే ఏదో ఒక ఫంక్షన్ కు కాసేపు మాత్రమే కట్టుకుంటారు. ఇక ఉతకకుండా దాన్ని మళ్లీ బీరువాలో దాస్తుంటారు.
మళ్లీ మరో ఫంక్షన్ కు తీసి కట్టుకుంటారు. ఇలాంటి తప్పనిసరి పరిస్థితులకు మినహాయింపు ఉంటుందని పెద్దలు సూచిస్తున్నారు. అయితే రాత్రి పూట వేసుకునే బట్టలను మాత్రం ఉతకకుండా వేసుకోవద్దంటున్నారు.
ఉదయం స్నానం చేసే సమయంలో తప్పనిసరిగా నీటిలో జాడించి ఆరేసుకోవాలని సూచిస్తున్నారు. తర్వాతే వాటిని ధరించాలని చెప్తున్నారు. ఇలా చేస్తే ఆయుక్షీణం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.
ఒకరి దుస్తులు మరొకరు వాడద్దు
అలాగే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి బట్టలు మరొకరికి ఇవ్వడం చూస్తుంటాం. ఇలాంటివి మంచిది కాదని సూచిస్తున్నారు. వీలైనంత వరకూ ఒకరి బట్టలు మరొకరు ధరించవద్దు.
ఇలా ధరించడం వల్ల వారిలోని నెగెటివ్ ఎనర్జీ మనలోకి ప్రవేశించి అనేక ఇబ్బందలుు ఎదుర్కొంటాం. దీంతో పాటు వాడి శరీరం విసర్జించిన చెమట లాంటివి కూడా మరొకరి శరీరానికి ఇన్ ఫెక్షన్ కు దారి తీయచ్చు.
ఒక వేళ తప్పదనుకున్నప్పుడు వాటిని ఉతికి, ఇస్త్రీ చేసి వేసుకోవాలి. అది ఒకటి రెండు సార్లు అయితే ఫర్వాలేదు కానీ ఎక్కువ సార్లు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
ఇలా దుస్తులను మళ్లీ.. మళ్లీ వేసుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి ఇబ్బందులు పడతారు. ఇతరుల దుస్తులు వేసుకోవడం కూడా వారిలోని ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే అది మనకు చుట్టుకుంటుంది.