యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన ఆమదారికీ తెలిసిందే. అమెరికా నుండి అనకాపల్లి వరకు ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులు నోరెళ్లబెడుతున్నారు.
రాబొయ్యే రోజుల్లో కచ్చితంగా ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుంది అని బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి పోటీ గా షారుఖ్ ఖాన్ నటించిన ‘డుంకీ’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది.
మొదటి రోజు వసూళ్లు కూడా కేవలం 54 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఈ ఏడాది లో రెండు సార్లు వెయ్యి కోట్లు కొల్లగొట్టిన షారుఖ్ లాంటి స్టార్ కి ఇది చిల్లర కలెక్షన్స్ అనే చెప్పాలి. కచ్చితంగా సలార్ మరియు డుంకీ చిత్రాలకు నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఉంటుందని అనుకున్నారు అందరూ.
కానీ డుంకీ చిత్రానికి ఈరోజు వచ్చిన ఆక్యుపెన్సీలు చూస్తుంటే ‘సలార్’ కి వార్ వన్ సైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. హిందీ లో కూడా నేడు సలార్ కి వచ్చిన వసూళ్లు డుంకీ కి వచ్చిన వసూళ్ల కంటే ఎక్కువ. కాబట్టి క్రిస్మస్ కి అటు బాలీవుడ్ ఆడియన్స్ కి ఇటు టాలీవుడ్ ఆడియన్స్ కి ‘సలార్’ చిత్రమే మొదటి ఛాయస్.
కాబట్టి క్రిస్మస్ రోజు ఈ చిత్రం ఏ రేంజ్ లో వసూలు చేస్తుందో చూడాలి. వెయ్యి కోట్ల రూపాయలకు ‘సలార్’ చేరువ అవుతుందా లేదా అనేది ఈ క్రిస్మస్ కి వచ్చే వసూళ్లను చూసి చెప్పేయొచ్చు. ఒకవేళ వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటే మాత్రం సౌత్ నుండి రెండు సార్లు వెయ్యి కోట్ల మార్కుని అందుకున్న హీరో గా ప్రభాస్ చరిత్ర సృష్టిస్తాడు.
టాక్ బాగుంది, రేటింగ్స్ బాగున్నాయి కాబట్టి లాంగ్ రన్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. చూడాలి మరి ఏ రేంజ్ లో ఈ చిత్రం వసూళ్లు రాబడుతుంది అనేది. ప్రస్తుతం ఉన్న ఊపుని చూస్తూ ఉంటే రెండు వారాలు నాన్ స్టాప్ హౌస్ ఫుల్స్ పడే అవకాశం ఉందని తెలుస్తుంది, చూడాలి మరి.