తెలంగాణలలో ఎన్నికలు ముగిసిన తెల్లారి నుంచే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఎలక్షన్ కమిషన్ దృష్టి ఏపీపై పడిరది.
మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఏపీ శాసనసభకు, భారత పార్లమెంట్‌కు జరగనన్ను ఎన్నికలకు సంబంధించి ఎవరికి వారు తమ తమ పనుల్లో బిజీగా మారిపోయారు.
ఓవైపు రాజకీయపార్టీలు తమ తమ వ్యూహాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తమ పని తాము చేసుకుంటూ పోతోంది.
ఇందులో భాగంగా 8వ తేదీన భారత ఎన్నికల కమిషన్‌కు చెందిన బృందం మూడురోజుల పర్యటన నిమిత్తం విజయవాడకు చేరుకోనుంది. ఇందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎలక్షన్ కమిషనర్‌లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ 8వ తేదీ విజయవాడకు రానున్నారు.
సహజంగా ఎలక్షన్ కమిషన్‌కు చెందిన సభ్యులు ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల్లో పర్యటించడం, అధికారులకు తగిన సూచనలు చేయడం,
ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు తగిన వాతావరణం కల్పిండం కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. రేపటి ఎన్నికల కమిషన్ బృందం పర్యటన మాత్రం ఏపీలో అలజడి సృష్టిస్తోంది.
ముఖ్యంగా అధికార పార్టీకి సంకటంగా మారేలా ఉంది. ప్రతి ఎన్నికల్లో దొంగ ఓటర్లు రావటం ఓట్లు వేసి వెళ్లిపోవడం, చనిపోయిన వారి ఓట్లను కూడా తొలి గంటల్లోనే వినియోగించుకోవడం,
ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అయితే తమ విజయం కోసం అధికార పార్టీ కొత్త కొత్త అడ్డదారులకు తెరతీసింది.
పక్క రాష్ట్రంలోని వారిని ఇక్కడ భారీగా ఓటర్లుగా చేర్పించడం, వాలంటీర్ల ద్వారా ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, అభిమానుల ఓట్ల వివరాలు సేకరించి అధికారులపై ఒత్తిడి తెచ్చి భారీ ఎత్తున వాటిని తొలగించడం,
జీరో డోర్ నెంబర్లపై, ఖాళీ స్థలాల్లో కూడా అపార్ట్‌మెంట్స్ ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి భారీగా ఓట్లను నమోదు చేయించడం వంటి అనేక అక్రమాలకు పాల్పడిరదని ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేశాయి.
ఆరోపణలే కాదు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా పలుమార్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించాయి కూడా. అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్పందించలేదని ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు.
ఈ విషయమై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా ఢల్లీికి వెళ్లి మరీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా భారత ఎన్నికల సంఘం కమిషనర్ తన బృందంతో ఏకంగా మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనుండటం అధికార పార్టీలో గుబులు రేపుతోంది.
దీంతో పాటు ఆ పార్టీకి సహకరించి ప్రతిపక్ష ఓట్లను గల్లంతు చేయటానికి సహకరించిన అధికారుల గొంతులో కూడా పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా భావించవచ్చు.
చూడాలి ఈ అత్యున్నతస్థాయి బృందం అక్రమార్కులపై నిజంగానే చర్యలు తీసుకుంటుందా? లేక తూతూ మంత్రంగా పర్యటించి చేతులు దులుపుకుంటుందా?.