అదేదో ఓ సినిమా లో శత్రువులు ఎక్కడో ఉండరు రా.. అక్కలు, చెల్లెల్లు రూపంలో పక్కనే ఉంటారనే ఓ డైలాగ్ ఉంది. ఇప్పుడు ఆ సినిమా డైలాగ్ మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు.
ఎందుకంటే.. జగన్ చెల్లి షర్మిల కుమారుడి పెళ్లి జరుగనున్న నేపథ్యంలో.. ఆమె స్వయంగా తన అన్న జగన్ మోహన్ రెడ్డి దగ్గరకి వచ్చింది.
పెళ్ళికి తన అన్నని పిలిచేందుకు ఆమె తన కుమారుడు, కాబోయే కోడలిని తీసుకొని తాడేపల్లి లో జగన్ ఇంటికి వచ్చింది.
అన్నకి పెళ్లి కార్డు ని అందించి.. మీడియాతో పొడి పొడి మాటలు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే.. జనాలు ఏమి అనుకున్నా, అనుకోకపోయినా సాక్షాత్తు జగన్ పార్టీ పత్రిక అయిన సాక్షి లో రాసిన రాతలే షర్మిలని శత్రువు అన్నట్టుగానే ఉన్నాయి.
ఇంతకీ సాక్షిలో ఏమి రాశారంటే.. షర్మిల తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద తొలి కార్డుని అందించడానికి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఈ విషయంలో సాక్షి కూపీ లాగి నిజాలు బయట పెట్టింది.
షర్మిల వచ్చిన విమానం సాక్షాత్తు చంద్రబాబు సొంత మనిషి సీఎం రమేష్ కి చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్స్ లిమిటెడ్ సంస్థకి చెందినదిగా తెలుస్తుంది.
ఈ విషయాన్ని స్వయంగా సాక్షి రాయడం చూస్తుంటే.. ఏకంగా ఆమెని శత్రువుగా పరిగణించవచ్చని అర్ధం వచ్చేలా చెప్పింది.
అంతే కాక షర్మిల అదే విమానంలో కడప నుండి తాడేపల్లి కి రావడం విశేషం. ఇక జగన్ కి రాజకీయ బద్ద శత్రువులైన బిటెక్ రవి, దేవగుడి నారాయణ రెడ్డి లని కడప విమానాశ్రయంలో షర్మిల భర్త కలసి.. ఏకంగా ఫొటోలకి ఫోజులు ఇవ్వడం విశేషం.
ఈ విషయాలని సాక్షి ప్రత్యేకంగా రాయడం చూస్తుంటే.. షర్మిలని తమ శత్రువుగా భావిస్తున్నట్లు చెప్పకనే చెబుతుంది వైసిపి. ఏది ఏమైనా శత్రువులని కలుపు కుంటూ అన్నని కలడంతో అటు రాజశేఖర్ రెడ్డి అభిమానులు మాత్రం షర్మిలపై ఒకింత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.