
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను రేకెత్తించింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఒకే సమయంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దేశీయంగా మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లోనూ మంచి వసూళ్లు రాబట్టాలని చూస్తోంది.
అమెరికా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని, నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున ప్రీమియర్ షోలను ప్లాన్ చేసింది. నార్త్ అమెరికాలోని 511 థియేటర్లలో సుమారు 1,750 ప్రదర్శనలతో ఈ చిత్రం ప్రీమియర్ షోలను ప్రారంభించింది. ఈ షోలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $650K వరకు వసూళ్లు రాబట్టింది.
ఇదే జోరులో కెనడా సహా మొత్తం ప్రీమియర్ షో వసూళ్లు $1 మిలియన్ మార్క్ దాటుతాయని ఆశించారు. కానీ, కొన్ని అపశ్రుతుల వల్ల ఈ అంచనాలకు కొంత ఎదురుదెబ్బ తగిలింది. నార్త్ అమెరికాలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, కంటెంట్ డెలివరీ ఆలస్యాల కారణంగా AMC థియేటర్లలో కొన్ని ప్రదర్శనలను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ రద్దుతో గేమ్ ఛేంజర్ ప్రీమియర్ షో వసూళ్లపై ప్రభావం పడింది. ఈ పరిణామం వల్ల దాదాపు $100K మేర నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల మధ్యన, ప్రీమియర్ షోలు ముగిసేసరికి గేమ్ ఛేంజర్ నార్త్ అమెరికాలో $925K వరకు వసూలు చేసింది. తొలి రోజు పూర్తయిన తర్వాత మరింత క్లారిటీ వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీ మార్కెట్లో రామ్ చరణ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. కానీ, నార్త్ అమెరికా మార్కెట్లో బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ కోసం 4.5 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు చేయాల్సి ఉంది.
చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చినట్లయితే, ఈ టార్గెట్ అందుకోవడం సాధ్యమేనని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. నిర్మాతలు కూడా ప్రమోషన్లను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. మొత్తంగా, తొలి వారాంతపు వసూళ్లు, మౌత్ టాక్ ఆధారంగా ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్స్ పై కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది.