
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న విడుదలైంది. విడుదలకు ముందు ట్రైలర్‌తో మంచి పాజిటివ్ హైప్ క్రియేట్ చేసినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం, భారీ బడ్జెట్‌తో రూపొందించడం సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. కియారా అద్వానీ, అంజలి, ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు.
సినిమా మొదటి ఐదు రోజుల్లో ఇండియాలో ₹106.15 కోట్లు నెట్ వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా ₹154.50 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సంఖ్యలు చూస్తే, సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. ట్రేడ్ విశ్లేషణల ప్రకారం, ఆరవ రోజు ఈ సినిమా కేవలం ₹6.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దాంతో సినిమా వసూళ్లలో పెద్దగా డ్రాప్ వచ్చింది.
450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ప్రస్తుతం భారీ నష్టాల బాటలో నడుస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినిమాకు అవసరమైన దూకుడు కొనసాగకపోవడం వల్ల ఇది రాబోయే రోజుల్లో మరింత నష్టాలను చవిచూడొచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితి నిజమైతే, గేమ్ ఛేంజర్ శంకర్ కెరీర్లో మరో పెద్ద అపజయంగా నిలవడం ఖాయమవుతుంది.
దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తూ గేమ్ ఛేంజర్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఈ సినిమాలు ముందంజలో ఉండడంతో గేమ్ ఛేంజర్ పరిస్థితి మరింత దిగజారింది.
సంక్రాంతి సెలవులు కూడా పెద్దగా ఈ మూవీకి సెట్ కలేదు దీంతో గేమ్ ఛేంజర్ పరిస్థితి చాలా కష్టంగా మారింది. వీకెండ్ వరకు ఏదైనా భారీ మిరాకిల్ జరిగితే తప్ప ఈ సినిమా నష్టాల నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. శంకర్ గత చిత్రమైన ఇండియన్ 2 కూడా భారీ బడ్జెట్‌తో రూపొందినా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ కూడా శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు కెరీర్లలో మరచిపోలేని అపజయంగా నిలవవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.