జుట్టు సమస్యలతో చాలా మంది సతమతం అవుతుంటారు. యవ్వన దశలోనే తెల్లగా మారడంతో ముసలి వాళ్లలా కనిపిస్తున్నామంటూ ఆవేదన చెందుతారు.
అయితే ప్రస్తుతం తీసుకుంటున్న ఫుడ్ ఒక కారణమైనా కాలుష్యం కూడా మరో కారణం కావచ్చు. ఇంకొందరిలో కుటుంబ వారసత్వంగా కూడా తెల్లజుట్టు సంక్రమిస్తుంది.
ఇలాంటి సమస్యలు రావడంతో చాలా మంది జుట్టు నల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో దొరికే ప్రతి సాధనాన్ని వాడుతుంటారు. దీంతో జుట్టు నల్లగా అవడం దేవుడెరుగు ఉన్న జుట్టు కూడా రాలిపోతుంది.
ప్రకృతి మిశ్రమంతో సైడ్ ఎఫెక్ట్ లకు దూరం..
జుట్టు రాలిపోవడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు. ప్రకృతి పరమైన సాధనాలను ఉపయోగిస్తే జట్టు నల్లబడడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్తున్నారు.
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు ఆయుర్వేధంలో అనేక చిట్కాలు ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. దీనితో తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు దృఢంగా అవుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
మిశ్రమం తయారు ఇలా..
స్టౌపై ఒక గిన్నె పెట్టి గ్లాసు నీటిని పోసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ టీ పొడి, రెండు బిర్యాణి ఆకులు, వెల్లుల్లి రెబ్బ వేసి బాగా మరిగించాలి. దాదాపు ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగాక ఇంగ్రీడియన్స్ లో ఉన్న పోషకాలు నీటిలో చేరుతాయి.
ఈ నీటిని వడగట్టి దీనితో కొంచెం కొబ్బరినూనె కలపాలి. తల స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరనిచ్చి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లయ్ చేయాలి.
వారానికి రెండు సార్లు..
అరగంట తర్వాత మామూలుగా జుట్టును కడగాలి. అయితే షాంపు లాంటివి మాత్రం వాడకూడదు. ఈ మిశ్రమాన్ని అప్లయ్ చేసిన రోజు షాంపు వాడద్దు. మరుసటి రోజు వాడొచ్చు.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే క్రమ క్రమంగా జుట్టు నలుపు రంగులోకి మారుతుంది. దీంతో పాటు రాలిపోవడం, చుండ్రు సమస్యలకు శాస్వతంగా చెక్ పెట్టచ్చు. జుట్టు సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది ఈ మిశ్రమం.
ఇలాంటి ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం కనిపిస్తుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఉండవు. ఇందులో ఉపయోగించే ఇంగ్రీడియన్స్ మనకు తక్కువ ఖర్చుతో దొరికేవే. కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టి మార్కెట్ లో దొరికే వాటిని వాడకుండా ఇలాంటివి ట్రై చేస్తే మంచింది.
గమనిక: ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసమే. దీన్ని వైద్యుల సలహాగా భావించవద్దు. సమస్యలు ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.