శృంగారాన్ని అందరూ బూతు పదంగా చూస్తారు. కానీ ఎన్నో శారీరక, మానసిక రుగ్మతల నుంచి దూరం చేయడంలో ఇది బాగా సాయపడుతుందని ఆరోగ్య నిపుణులు ఎప్పటి నుంచో చెప్తున్నారు.
ఒక్కసారి సెక్స్ లో పాల్గొంటే దాదాపు 200 కేలరీలు కరిగిపోతాయని అధ్యనాయలు కూడా చెప్తున్నాయి. కానీ ఈ మధ్య చాలా మంది దంపతులు సెక్స్ కు దూరం అవుతున్నారట. కారణాలు ఏమైనా ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.
పట్టణ ప్రజల కంటే పల్లెటూరులోనే శృ_గారం ఎక్కువ..
దీనికి ప్రస్తుతం బిజీగా మారిన జీవన శైలి కారణం అవుతుందని కూడా కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. దంపతులు శృంగారంలో పాల్గొంటున్న విషయాలపై గ్రామాలు, పట్టణాల్లో ఒక సర్వే జరిగింది.
ఇందులో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సాధారణంగా సెక్స్ తో కలిగే ప్రయోజనాలు గ్రామ ప్రజలకు అంతగా తెలియవు. పట్టణంతో పోల్చుకుంటే అక్కడ అక్షరాస్యత తక్కువ.
కానీ ఉదయం పనులకు వెళ్లిన గ్రామస్తులు సాయంత్రం రాగానే ఉన్న సమయాన్ని శృంగారానికి కేటాయిస్తున్నారు. కానీ పట్టణ వాసులు మాత్రం ఉదయం నుంచి ఆఫీసుల్లో బిజీ,
ఇక సాయంత్రం వచ్చాక సోషల్ మీడియాలో బిజీ కాస్త సమయం కేటాయించి పార్ట్ నర్ తో ఎంజాయ్ చేద్దామనే ఇంట్రస్ట్ ను పట్టణ వాసులు కోల్పోతున్నారు.
వారికి ఆ ఆలోచనలు కూడా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దీనికి కొన్ని ఫుడ్ హాబిట్స్ తో చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
14 వారాల పాటు పరిశోధనలు..
ఈ పరిశోధనలో రోజుకు 60 గ్రాముల గింజలు ఉన్న ధాన్యాలను తింటే శృంగార వాంఛనలు కలుగుతాయని తేలింది. 14 వారాల పాటు చేసిన పరిశోధనల్లో ఈ విషయాలను ధృవీకరించారు.
కొందరికి మామూలు ఆహారం ఇవ్వగా, మరికొందరికి బాదం, అక్రోట్స్, హేజెల్ నట్స్ ఇచ్చారు. ఇలా 14 వారాల తర్వాత నట్స్ తిన్నవారిలో కోరికలు ఎక్కువగా కలిగి సెక్స్ పట్ల హ్యాపీగా ఉన్నట్లు తేలింది. వీరిలో భావప్రాప్తి కూడా మెరుగైనట్లు కనుగొన్నారు.
శరీరంలో మంచి మార్పులు కనిపిస్తాయి..
నట్స్ లో ప్రొటీన్స్ తో పాటు పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలతో పాటు ఫాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి అంగ స్తంభనను పెంచడంలో తోడ్పడుతాయి.
దీంతో పాటు గుండె రక్తనాళ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాబట్టి సెక్స్ సమస్యలతో బాధ పడుతున్నవారు నట్స్ ను డైల్ లో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు.
మనం తీసుకునే ఆహారమే శరీరంలో అనేక మార్పులకు కారణం అవుతుంది. సెక్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని వివరించారు.
మనం తీసుకునే ఆహారంలోనే అంగస్తంభన, రుతుక్రమం తదితర సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు. ఇవన్నీ న్యాచురల్ వయాగ్రాలా పని చేస్తాయని అంటున్నారు.
నట్స్ తో ఒత్తిడి కూడా దూరం
నట్స్ తీసుకోవడం వల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుందని, దీనికి తోడు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని సూచిస్తున్నారు. సంపాదనపై ఉన్న శ్రద్ధను శరీరాన్ని కాపాడుకోవడంలో కూడా చూపాలని, అందులో సెక్స్ సమస్యలు ఉంటే వైద్యుల సలహాలు తీసుకుంటూ మంచి ఆహారం తీసుకొని అధిగమించవచ్చని సూచిస్తున్నారు.