రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ తనబలాన్ని మరింతగా పెంచుకోవాలనే వ్యూహంలో ఉంది. గత ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగినప్పటికీ సీట్ల విషయంలో ఘోరంగా వెనకబడిరది.
రాజోలు ఒక్కసీటు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా జనసేనకు రaలక్ ఇచ్చి వైసీపీ పంచన చేరిపోయారు. ఈసారి ఎలాగైనా సీట్ల విషయంలో తాము ముందడుగు వేయాలని పవన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
టీడీపీ లోకి విలీనం దిశగా అడుగులు వేస్తున్న జనసేన పార్టీ?
2024లో గతంలో ఓడిపోయిన భీమవరంతో పాటు తిరుపతిలో కూడా పవన్ పోటీ చేయాలనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనికి ఆ పార్టీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ గత ఎన్నికల్లో తన నియోజకవర్గాల మీద కాన్‌సన్‌ట్రేషన్ చేయకుండా మిగిలిన వారి గెలుపు కోసం తిరిగారని,
ఈసారి ఒక్కచోట మాత్రమే పోటీలో ఉండి, దానిమీద కొంత ఎక్కువ దృష్టి సారిస్తే గెలుపు నల్లేరుమీద నడకేనని కొందరు అంటున్నారు.
విశ్వసనీయ సమాచరం మేరకు జనసేనకు 2 లేదా 3 లోక్‌సభ స్థానాలు, 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు పొత్తుల భాగంగా దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం, దాదాపు 20 రోజులు ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో జనసేన తనకు వచ్చే స్థానాల్లో సమర్ధులైన అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు తమ పార్టీ నుంచి బలమైన అభ్యర్థుల లిస్ట్‌ను పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, పోతిన మహేష్, బత్తుల బలరామకృష్ణ,
కందుల దుర్గేష్, పంతం నానాజీ, ఉదయ శ్రీనివాస్, చిక్కం దొరబాబు, గుడివాడ రామచంద్రరావు, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, ఆమంచి శ్రీనివాస్, లోకం నాగమాధవి, పడాల అరుణ, సుందరపు సతీష్, పంచకర్ల సతీష్, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పితాని బాలకృష్ణ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
జనసేన ఇచ్చిన లిస్ట్‌లో రాజమండ్రి రూరల్, తెనాలి జనసేన కోరుతుండడంతో అక్కడ ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు 6సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి,
తెనాలిలో సీనియర్ నాయకుడు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ల విషయంలో కొంత సంధిగ్ధత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా జనసేన కోరిన నియోజకవర్గాల్లో 90 శాతం టీడీపీకి అభ్యంతరం లేదని తెలుస్తోంది.