ఇది రొటీన్ సామెతే అయినా చెప్పక తప్పడం లేదు. తాను చేస్తే సంసారం.. వేరేవారు చేస్తే వ్యభిచారం అందట వెనకటికొక పతివ్రత. అచ్చం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భజనపరుల తీరు అలాగే ఉంది.
విషయంలోకి వెళితే రెడ్ బుక్ పేరుతో ఒక బుక్‌ను పెట్టి, అందులో పేర్లు రాస్తున్నానని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి అంతు చూస్తానని నారా లోకేష్ తమను బెదిరిస్తున్నాడంటూ సీఐడీ అధికారులు కోర్టుకు వెళ్లారు.
జగన్ కి పోటీ గా లోకేష్ ని నిలిపేందుకు ప్రశాంత్ కిషోర్ మాస్టర్ ప్లాన్
లోకేష్‌ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలని కూడా విన్నవించారు. కోర్టు ముందు లోకేష్‌కు నోటీసులు జారీ చేయమని చెప్పడంతో ఈరోజు శుక్రవారం సీఐడీ పోలీసులు లోకేష్‌కు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. లోకేష్ కూడా అవి అందినట్లు రిప్లయ్ ఇచ్చారు.
ఇక అసలు విషయంలోకి వస్తే.. రాజకీయాల్లో తమ ప్రత్యర్ధులను ఎదుర్కొనటానికి అధికారంలో ఉన్న వాళ్లు వ్యవస్థలను వాడుకోవడం సహజం.
అలాంటప్పుడు ప్రతిపక్షాలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అక్రమ చర్యలకు పాల్పడ్డ అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పడం కూడా సహజమే.
ఇందుకు ప్రపంచంలోని ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు లోకేష్ చేసింది కూడా అదే. ఇది కేవలం రాజకీయాల్లో కామన్‌గా ఉండే విషయం.
కానీ దీన్ని చిలువలు పలువలు చేసి, లోకేష్ తమను ఏదో చేసేస్తున్నాడని కేసులు కట్టడానికి, ఆల్రెడీ ఉన్న బెయిల్ రద్దు చేయించటానికి ప్రయత్నించే అధికారులు ఒక్క విషయం మర్చిపోతున్నారు.
2019 ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి కూడా చంద్రబాబు అవినీతిపై ఓ పుస్తకం కూడా అచ్చేశాడు. అందులో చంద్రబాబు, ఇతర అధికారులు పాల్పడిన అవినీతి, వాటికి సంబంధించిన జీవోలు, అధికారుల పేర్లు, ఇతర వివరాలు అందులో పొందు పరిచారు.
ఈ పుస్తకాన్ని బహిరంగంగా విడుదల చేస్తూ.. తాము అధికారంలోకి రాగానే ఈ అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రశ్నేలేదని కూడా జగన్ ఆరోజు గొంతు చించుకున్నారు.
మరి ఇప్పుడు లోకేష్ చేసిన పనికి, నాడు జగన్ చేసిన పనికి తేడా ఏముంది. అంటే ఇప్పుడు ఇదే విషయం మీద అరెస్ట్‌లు జరగాలి అంటే ముందు జగన్‌ను అరెస్ట్ చేయాలి కదా.