కేజీఎఫ్ స్టార్ యష్ గురించి పరిచయం అక్కర్లేదు. కేజీఎఫ్ రెండు చాప్టర్స్ లో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటూ సాగింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఆయన కేజీఎఫ్ వరకూ అంత సుపరిచితమైన వ్యక్తి కాదు. కానీ కేజీఎఫ్ రిలీజ్ తర్వాత ఒక్కసారి ఆయన ప్రభంజనం మొదలైంది. కోట్లాది మంచి ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నాడు ఆయన. ఇంత గుర్తింపు సాధించుకునే వరకూ ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన జీవితంలోని కొన్ని ఘట్టాల గురించి తెలుసుకుందాం.
ఇష్టం లేకున్నా చదువు ముగించాక
8 జనవరి 1986లో పుట్టారు యష్. ఆయన తండ్రి ఓ బస్సు డ్రైవర్ కాగా తల్లి సాధారణ గృహిణి. మొదటి నుంచి చురుకుగా ఉన్న యష్ కు చదువు అంటే అంత ఇంట్రస్ట్ ఉండేది కాదట. కానీ తల్లిదండ్రులు, సమాజం ఒత్తిడితో ఏదో చదివామా అన్నట్లు ముగించాడట. తర్వాత చిత్ర పరిశ్రమలోకి వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపేవాడట. కానీ ఆయన తండ్రి మాత్రం ససేమీరా వెళ్లేది లేదు అన్నాడట. తనలాగే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని సూచించేవాడట. సినీ ఇండస్ట్రీ అంటే ఇష్టం పెంచుకున్న ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయాడట.
2007లో ఇండస్ట్రీలోకి
2007లో ‘జంబదహుడిగి’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు యష్. ఆ చిత్రంతో ఒక చిన్న పాత్ర వేశారు ఆయన. అది మంచి హిట్ కావడంతో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. 2008లో మెయిన్ హీరోగా ‘రాకీ’ సినిమాలో ఎంట్రీ ఇచ్చారు యష్. ఆ తర్వాత వచ్చిన ‘మొగ్గిన మనసు’ అనే చిత్రం షూటింగ్ సమయంలో జూనియర్ రాధికతో పరిచయం అయ్యింది యష్ కు.
రాధికతో పెళ్లి
తర్వాత ఇద్దరూ పరిచయం పెంచుకున్నారు. అది కాస్తా ప్రేమగా మారింది. ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత ఆయన దశ తిరిగింది. మంచి మంచి చిత్రాలు క్యూలో నిల్చున్నాయి. వెంట వెంటనే ప్రాజెక్టులను ముగించుకుంటూ మంచి స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
యష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రొడ్యూసర్
హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ కేజీఎఫ్ ప్రాజెక్టు మొదలు పెట్టే సమయంలో యష్ వారికి సరైన హీరోగా గుర్తించారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా యష్ కు ఫుల్ మార్కులు వేశారట. దీంతో ఆయన కేజీఎఫ్ లోకి వచ్చారు. అయితే మొదట ఈ చిత్రాన్ని ప్రాంతీయ భాషా చిత్రంగా రిలీజ్ చేశారు హోంబలె ఫిలిం ప్రొడ్యూసర్. తర్వాత దానికి వస్తున్న క్రేజ్ చూసి పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేశారు. దీంతో ఆ చిత్రం ఇండియాలోనే భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. వరుసగా రెండు చాప్టర్లు ముగించుకొని మూడో చాప్టర్ తీసేందుకు ప్రణాళికలు కూడా వేస్తున్నారు డైరెక్టర్, ప్రొడ్యూసర్.
చాప్టర్ 3కి యష్ దూరం..!
అయితే కేజీఎఫ్ చాప్టర్ 3లో యష్ కు బదులు మరో హీరోను తీసుకోవాలి అనుకుంటున్నట్లు హోంబలె ఫిలిం అధినేత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకచ్చారు. దీంతో యష్ ఫ్యాన్స్ కొంచెం అసహనంతో ఉన్నట్లు తెలిసింది.