ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అని ఊరకే అనలేదు. ఒక్కోసారి వాళ్లమాటలు అర్ధం అయి.. అవనట్టుగా.. ఏదో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాంటి కన్‌ఫ్యూజన్ కంటెంట్‌నే మనముందుకు వదిలింది అందాల ముద్దుగుమ్మ మీనా.
బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసి, సీతారామయ్యగారి మనవరాలితో హీరోయిన్‌గా ప్రమోట్ అయి, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అగ్ర కథానాయకులందరితో కలిసి నటించి రికార్డులు నెలకొల్పిన మీన ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్నారు.
ఆ దర్శకుడి పాలప్యాకెట్ కష్టాలు వింటే…
కరోనా సమయంలో ఆమె భర్త లంగ్స్ ప్రాబ్లమ్‌తో చనిపోయారు. ఇది దక్షిణభారత చిత్ర సీమను షాక్‌కు గురి చేసింది. చిన్న వయస్సులోనే మీనాకు ఇలాంటి కష్టం రావడం పట్ల అందరూ బాధపడ్డారు.
తాజాగా ఓ మీడియా సంస్థ ప్రతినిధితో కొన్ని విషయాలు పంచుకున్నారు.. చిన్న తనం నుంచీ నటించడం వల్ల కొన్ని ఆనందాల్ని కోల్పోయిన మాట వాస్తవమే.
అయితే దానికి వేల రెట్లు పేరు, ప్రఖ్యాతులు సాధించాను. పెళ్లయిన కొద్ది కాలానికి మా వారు చనిపోవడం నాకు చాలా తీరని లోటు. ఆయనకు లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంది.
అది లేట్ అవ్వడం వల్ల నన్ను, పాపను ఒంటరిగా విడిచి పైలోకాలకు వెళ్లిపోయారు. ఆయన చనిపోయిన కొద్ది నెలలకే మళ్లీ నేను పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రాసేశారు.
ఏకంగా ధనుష్ గారిని పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా రాశారు. అప్పుడు చాలా ఫీలయ్యా. అసలు మీడియాతో మాట్లాడకూడదు అనుకున్నా. కానీ అదే మీడియా వల్ల మీనా ఇంతగా గుర్తింపు తెచ్చుకుంది అనే విషయాన్ని తలుచుకుని సర్ధుకున్నా.
ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకోను, అలాగని జీవితాంతం ఒంటరిగా ఉంటానని కూడా చెప్పలేను అన్నారు. ఇదే సందర్భంలో గీతాంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేను చేయాల్సి ఉంది.
కానీ చదువు పాడవుతుందని అమ్మ ఒప్పుకోలేదు. అలాగే నిన్నేపెళ్లాడుతా, నరసింహనాయుడు మరికొన్ని మంచి సినిమాలు డేట్స్ ప్రాబ్లమ్ వల్ల వదులుకోవాల్సి వచ్చింది అన్నారు.