సాధారణంగా స్టార్ హీరోలు అంటే వాళ్ళు తీసుకునే ఆహారం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా షూటింగ్ సమయంలో ప్రొడ్యూసర్లకు స్టార్ హీరోలను మెయింటైన్ చేయడం కాస్త కష్టమే. సెట్స్‌కి స్టార్ హీరోలు వచ్చినప్పుడు, వారికి అందుబాటులో ఉండే సౌకర్యాల గురించి నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారు అడిగినది క్షణాల్లో సిద్ధం చేయడమే కాదు, వారికి ఇచ్చే ఆహారం హైజెనిక్‌గా ఉండాలనే డిమాండ్ ఉంటుంది. స్టార్ హోటల్స్ నుంచి అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్ అన్నీ తెప్పించాల్సి వస్తుంది. కొంతమంది మాత్రం ఇంటి నుంచి ఆహారం తెప్పించుకోవడమే నమ్ముతారు. ఇది వారి ఆరోగ్య సూత్రాలు, అలవాట్లపై ఆధారపడుతుంది.
ఇలాంటి సమయంలో స్టార్ హీరోలందరికీ భిన్నంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రవర్తన ప్రత్యేకంగా నిలుస్తుంది. తాను ఎంత పెద్ద స్టార్ అయినా, షూటింగ్ సెట్స్‌లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ టీమ్ వండిన ఆహారమే తీసుకుంటారట. షూటింగ్ తన ఇంటి పక్కనే జరుగుతున్నా, ఇంటికి వెళ్లకుండా అదే ఫుడ్ తింటారు. ఆయన సతీమణి ఇంటి నుంచి ఆహారం పంపిస్తానన్నా అంగీకరించరట. హైజెనిక్ ఆహారం అని చెప్పినా, తాను ఆరోగ్యంగా ఉండటానికి ప్రొడక్షన్ పుడ్‌నే కారణంగా భావిస్తారట. అంతేకాకుండా, “నేను ఇలా ఆరోగ్యంగా ఉంటే మీకు ఇష్టం లేదా?” అంటూ హాస్యంతో మాట్లాడుతారట.
ఇండస్ట్రీలో బాలయ్య పుట్టి పెరిగారు. ప్రొడక్షన్ పుడ్‌పై ఆయనకు ఉన్న గౌరవం ప్రత్యేకం. “ఎంత మంచి స్టార్ హోటల్ అయినా, వాళ్లు బంగారంతో చేస్తారా?” అంటూ జోకులుగా చెప్పే బాలయ్య ప్రొడక్షన్ టీమ్ వండిన ఆహారాన్ని గొప్పగా భావిస్తారు. ఇది ఆయన సింప్లిసిటీని తెలియజేస్తుంది. బాలయ్య చూడడానికి చాలా కోపిష్టిగా కనిపిస్తారు కానీ ఆయన మనసు మాత్రం వెన్నలాంటిది అని అనేక సందర్భాలు నిరూపిస్తున్నాయి. సెట్స్ లో హీరో కూడా ప్రొడక్షన్ ఫుడ్నే తింటారు అంటే కచ్చితంగా మిగిలిన వాళ్ళకి కూడా నాణ్యమైన భోజనమే అందుతుంది అనేది బాలయ్య భావన. ఇలాంటి సందర్భాలలో ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్ మరోసారి స్పష్టమైంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు ప్రొడక్షన్ ఫుడ్ తీసుకోవడం మానేసి, ఇంటి నుంచి లేదా హోటల్స్ నుంచి ఆహారం తెప్పించుకుంటారు. చాలా మంది షూటింగ్ లొకేషన్‌లో తిన్నా, అది ప్రత్యేకంగా ప్రిపేర్ చేస్తేనే తీసుకుంటారు. తిండిలో నాణ్యత ఉండాలని కోరడం వారి హక్కు. కానీ బాలయ్యకు అలాంటి ప్రత్యేకతలు ఉండవు. నిర్మాతలకు ఆయన ఎటువంటి భారంగా ఉండకుండా, అందరితో కలిసి తినడమే గౌరవంగా భావిస్తారు.
బాలయ్య ఈ గుణం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఆయన సింప్లిసిటీని చూసినవారెవరైనా, ఆయనను ఆదర్శంగా భావించకుండా ఉండలేరు. నటనతోనే కాక, తన వ్యక్తిత్వంతోనూ అభిమానులను అలరిస్తున్న ఆయన నిజంగానే ఒక ప్రత్యేకమైన వ్యక్తి.