ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా గాడిద గుడ్లే…!

0
178
donkey eggs
Now everywhere in Telangana you see donkey eggs...!

తెలంగాణలో ఇప్పటి దాకా కోడి గుడ్ల వ్యాపారం బాగా జరుగుతూ ఉండేది. అయితే ఒక్కసారిగా గాడిద గుడ్లు ప్రత్యక్షం అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గాడిద గుడ్డు ఏంటని అనుకుంటున్నారా? అదే నండి. గాడిద గుడ్డు పోస్టర్లు. బడ్జెట్ సమావేశాలకు పక్కరాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తమకు ఏమి ఇవ్వలేదని సాక్షాత్తు ముఖ్యమంతి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసాడు.

బిజెపికి తెలంగాణ 8 సీట్లు ఇచ్చినా తమకి బడ్జెట్ లో తీవ్ర అన్యాయం జరిగిందని హైదరాబాద్ ల పోస్టర్లు వెలిసాయి. “బిజెపికి 8 సీట్లు ఇస్తే.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి ఏమొచ్చింది? గాడిద గుడ్డు” అంటూ పోస్టర్లు ప్రత్యక్షం అయ్యాయి. ఇవి చూసిన ప్రజలు కొంత ఆశ్చార్యానికి లోనై.. లోలోన నవ్వుకుంటున్నారు. ఈ పోస్టర్లు ఇప్పుడు బస్సు స్టాప్ ల దగ్గర, జంక్షన్ ల వద్ద దర్శనం ఇస్తున్నాయి.

గత పార్లమెంట్ ఎన్నికలకి ముందు మోడీ పదేళ్లు అదికారం లో ఉన్నా తెలంగాణాకి ఏమి ఇవ్వలేదని గాడిద గుడ్డని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఇప్పుడు బడ్జెట్ అయ్యాక ఇలా కొత్తగా విన్నూత రీతిలో గాడిద గుడ్డు పోస్టర్లు పెట్టడం విశేషం. కాగా బడ్జెట్ లో తమకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి.