
ప్రశాంత్ నీల్ ఇటీవల “కేజీఎఫ్”, “కేజీఎఫ్ 2”, “సలార్” వంటి భారీ హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. మరపక ఎన్టీఆర్ దేవర లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో ఓ మాస్ బ్లాక్‌బస్టర్ సినిమా రాబోతుందని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కొన్నేళ్ల క్రితమే అనౌన్స్ అయినప్పటికీ, కరోనా మహమ్మారి, ఇతర కారణాలతో ఆలస్యమైంది.
ప్రస్తుతం సలార్ 2 పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ ఇతర ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో, సలార్ 2కి కొంత సమయం తీసుకోవాలని ప్రశాంత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్‌తో సినిమాను 2025 ఆరంభంలో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. నిర్మాతలు జనవరి మూడో వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు.
కర్ణాటకలో ఈ ప్రాజెక్ట్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కన్నడ మీడియా కథనాల ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తుందని చెప్పబడుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుందా అనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి, కానీ ఈ విషయంపై ప్రశాంత్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
ఎన్టీఆర్ ప్రస్తుతం “దేవర” షూటింగ్‌ను పూర్తి చేసి, “వార్ 2″లో జాయిన్ అయ్యారు. హృతిక్ రోషన్‌తో కలిసి బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ సినిమాలో, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 15న విడుదల చేయనున్నారు.
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని, హీరోయిన్ ఎంపిక సహా ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 చివరిలో విడుదల అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కాంబినేషన్ నుంచి భారీ స్థాయిలో అంచనాలు ఉండటంతో, సినిమా మీద అభిమానుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.