ఒకప్పుడు చంద్రబాబు తనయుడు లోకేష్ అంటే పప్పు అని అనేవారు అందరూ. అతనికి అసలు మాట్లాడడమే రాదనీ, ఇతన్ని జనాల్లో ఎంతసేపు తిప్పితే ప్రత్యర్థి పార్టీలకు అంత లాభం జరుగుతుందని, అప్పట్లో సెటైర్ల వర్షం కురిపించేవారు నెటిజెన్స్.
కానీ లోకేష్ ఈమధ్య కాలం లో బాగా డెవలప్ అయ్యాడు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చేసాడు. చంద్రబాబు నాయుడు ముసలి వాడు అయిపోతున్నాడు. 80 దాటితే ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
పార్టీ మారాను అన్న ఫీలింగ్ నాకేమీ లేదు
మరి చంద్రబాబు యాక్టీవ్ పాలిటిక్స్ లో లేకపోతే ఇక టీడీపీ పరిస్థితి ఏమిటి?, క్లోజ్ అవ్వాల్సిందేనా అని కార్యకర్తలు అప్పట్లో భయపడేవారు. కానీ లోకేష్ ఈ రేంజ్ లో ఎదుగుతాడని మాత్రం కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త కూడా ఊహించి ఉండదు.
మాటల్లో స్పష్టత, ఏమి మాట్లాడితే ఏమి జరుగుతుందో అనే భయపడే తత్త్వం, లోకేష్ లో ఈమధ్యకాలం లో అసలు కనిపించడం లేదు.
ఏది మాట్లాడినా కుండబద్దలు కొట్టేసినట్టు మాట్లాడేస్తున్నాడు..ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన తో పొత్తులో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే.
చాలా కాలం నుండి మీడియా లో మరియు సోషల్ మీడియాలో సీఎం సీట్ షేరింగ్ కచ్చితంగా ఉంటుంది అని ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చాడు.
పొత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి కచ్చితంగా చంద్రబాబు గారే, అందులో మరో ఆలోచన లేదు అని కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పాడు.
అంతే కాకుండా జనసేన పార్టీ కి 25 సీట్లకు మించి ఇవ్వబోమని కూడా పరోక్షంగా చెప్పేసాడు. అది జరుగుతుందో లేదో తెలియదు కానీ, పొత్తులో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యాలంటే చాలా సాహసం ఉండాలి.
ఇవన్నీ టీడీపీ ని నడిపే న్యాయకత్వ లక్షణాలు అని అంటున్నారు టీడీపీ అభిమానులు. అలాగే లోకేష్ ని ఒక యూత్ ఐకాన్ గా మలిచేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహాలు చేస్తున్నాడట.
అందుకే ప్రముఖ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ ని తీసుకున్నారని, అతను చెప్పే విధంగానే లోకేష్ నడుచుకుంటాడని టీడీపీ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
అంటే రాబొయ్యే రోజుల్లో లోకేష్ ని జగన్ కి దీటుగా పోటీ ఇచ్చే లాగ తయారు చేయబోతున్నారని అర్థం అవుతుంది.