అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన విషయంలో కేంద్రం ఎంత కీర్తిని మూట గట్టుకుంటోందో.. అంతే అపకీర్తిని కూడా పొందుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు విచ్చేసారు.
మనదేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలుల, ముఖ్యంగా సినీ రంగాల నుంచి.. ఎలా ఎంతో మంది హాజరైనప్పటికీ మన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము రాకపోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీసింది.
మోడీ వన్‌మ్యాన్ షోగా సాగిన ఈ కార్యక్రమంలో సర్వం మోడీ మయం అన్నట్టుగా వ్యవహారం నడవడం చాలా మందిని అసహనానికి గురి చేసింది. సాక్ష్యాత్తూ రాష్ట్రపతినే పిలవక పోవడం.. ఒకవేళ పిలిచి ఉంటే.. ఆమె రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
ఇదే విషయంపై కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత ఢల్లీిలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి తీవ్రంగా స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ఉన్న మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ… ఒక గిరిజన మహిళ మన రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని గొప్పలు చెప్పుకున్న పెద్దలు ఆమెను రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు పిలవక పోవడం దారుణం అన్నారు.
స్వాతంత్య్రానికి పూర్వం ఎస్సీ, ఎస్టీలను గుడుల్లోకి రానిచ్చేవారు కాదని, ఇందుకోసం అనేక పోరాటాలు జరిగాయని, స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అదే వివక్ష కొనసాగుతోంది అనిపిస్తోంది అన్నారు.
మొన్నటికి మొన్న పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం అప్పుడు కూడా రాష్ట్రపతిని పిలవకుండా ప్రధాని తానే ప్రారంభోత్సవం చేశారని, ఇప్పుడు కూడా రాష్ట్రపతిని అవమానించడం తగదని అన్నారు. దేశంలో రామాలయం, హనుమంతుని విగ్రహం లేని ఊరు ఏదీ లేదు.
చిన్న పిల్లాడిని అడిగినా రామాయణం గురించి చెపుతాడని, కానీ మోడీ ఇప్పుడు మోడీ మనకు తెలియని రామాయణం గురించి చెపుతున్నట్లు నటిస్తున్నారన్నారు. రాముని తత్వం అందరికీ సమన్యాయమని, అందుకే రామరాజ్యం అంటారని, అయితే ఈ విషయాన్ని మాత్రం దాచి పెట్టిన మోడీ అండ్ కో రాముడిని ఆదర్శంగా తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు.