భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప 2 మూవీ తెలుగులో కాస్త ఆవరేజ్ టాక్ తో మొదలైనప్పటికీ మోస్తారు వసూళ్లు సాధిస్తుంది. అయితే రోజులకు అడుస్తున్న కొద్ది ఈ మూవీ హిట్ స్టేటస్ అందుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తోంది. మరి ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ చిత్రానికి దక్కిన అసాధారణ ఆదరణ ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు. ఎవరు ఊహించని విధంగా నార్త్ ఇండియాలో పుష్ప వసూళ్ల రికార్డు బద్దలు కొడుతోంది.
తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ కాస్త అటు ఇటు అయినా నార్త్ కలెక్షన్స్ వాటిని భర్తీ చేసి ఓవరాల్ గా పుష్ప కు తిరుగులేని సక్సెస్ అందించేలా ఉన్నాయి. లెక్కల ప్రకారం ఈ మూవీకి అసాధారణమైన బిజినెస్ జరుగుతోంది అంటే కేవలం నార్త్ ఆడియన్స్ పుణ్యమే అనడంలో సందేహం లేదు. బాహుబలి మూవీ తర్వాత మరే తెలుగు సినిమాకి ఈ రేంజ్ ఆదరణ నార్త్ లో చూడలేదు.
మనకు నేటివ్ మూవీ అయినా సరే.. ఇక్కడ కాస్త మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కానీ నార్త్ లో మాత్రం ఈ చిత్రం ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. మరోపక్క విదేశాల్లో కూడా పుష్ప 2కు మంచి క్రేజ్ ఏర్పడడంతో వసూళ్లు భారీగానే వస్తున్నాయి. అక్కడ తొలిరోజు 67 కోట్లు నెట్ వసూళ్లు చేసి.. ఇప్పటివరకు ఇండియాలోనే డే వన్ కలెక్షన్స్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది పుష్ప 2 . అయితే యుఎస్ లో పుష్ప 2 హిందీ వర్షన్ కు ఎక్కువ డిమాండ్ ఉంది. తెలుగు వెర్షన్ కూడా వసూళ్లు బాగానే సాధిస్తున్నప్పటికీ హిందీ కాస్త దూకుడుగా ఉంది.
విడుదలైన రెండు మూడు రోజులు తర్వాత.. మిగిలిన రాష్ట్రాలలో కాస్త మూవీ డ్రాప్ అయ్యింది.. ఆ తర్వాత మెల్లిగా పుంజుకుంది.. కానీ హిందీలో మాత్రం డే వన్ నుంచి నిలబెట్టి ఆడుతోంది ఈ చిత్రం. ఒక డబ్బింగ్ చిత్రం.. అందులో తెలుగు చిత్రం నార్త్ లో ఈ రేంజ్ లో హైట్ సృష్టించడం.. రికార్డు స్థాయిలో వసూళ్లు అందుకోవడం విశేషమే.