ఇప్పటి సినిమా మార్కెట్‌లో ఓటీటీ విడుదలల ప్రాముఖ్యత ఎక్కువైంది. అయితే, నిర్మాతలకు ఈ ప్రక్రియ చాలా సవాలుగా మారింది. సాధారణంగా, ఓటీటీ విడుదలలు థియేట్రికల్ రన్ పూర్తైన ఆరువారాల తర్వాత జరుగుతాయి. దీనికి సంబంధించి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప-2” మాత్రం ఈ క్రమాన్ని తలకిందులు చేసింది.
ఈ చిత్ర నిర్మాతలు తమ సినిమా విడుదల విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. “పుష్ప-2” కి నార్త్ బెల్ట్‌లో ఇంకా భారీ ఆదరణ ఉంది. థియేటర్లలో ప్రేక్షకులు కిక్కిరిసిన విధంగా హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిత్రం ఊపు తగ్గినా, హిందీ బెల్ట్‌లో మాత్రం వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ₹1600 కోట్ల పైగా వసూలు చేసిన ఈ చిత్రం, “దంగల్” హిందీ వసూళ్ల రికార్డులు చెరిపేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద “దంగల్” 2000 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సాధించింది. ఆ స్థాయి రికార్డులను కూడా “పుష్ప-2” తిరగరాస్తుందా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, “పుష్ప-2” ని 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలి అని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఓటీటీ కోసం సినిమాలూ ఎదురుచూసేవి..అయితే ఇప్పుడు పుష్ప ఓటీటీ సంస్థలను ఇలా వెయిటింగ్ చేయించడం ఇండియన్ సినిమాల సత్తా ను చాటుతోంది.
ఓటీటీ రిలీజ్ కోసం నెట్‌ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ, నిర్మాతలు ఇప్పుడు హోల్డ్‌లో పెట్టడం సినిమాకి గ్లోబల్ రేంజ్ పెంచే స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఓటీటీలు వేచి చూసే పుష్పరాజ్ స్టైల్‌కి బాక్సాఫీస్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది!అల్లు అర్జున్’పుష్ప’లో తన అద్భుతమైన నటనతో గోల్బల్ గుర్తింపును తెచ్చుకున్నాడు.పుష్ప రాజ్ పాత్రలో అతని డైలాగ్ డెలివరీ, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.