ఒక్కోసారి కొన్ని పరిణామాలకు.. ఊహించని వ్యక్తులు రియాక్ట్ అవుతుంటారు. ఇది రాజకీయాలతోపాటు కొన్ని సామాజిక విషయాల్లో కూడా సహజం. తాజాగా ఇటువంటి అనూహ్య పరిణామానికి తెరతీశారు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమ నేతగా ఎంతో పేరు సంపాదించిన ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. రాజకీయ నాయకుడిగా కంటే కాపు ఉద్యమ నేతగానే ముద్రగడకు ఎనలేదని కీర్తి వచ్చిందన్న సంగతి తెలిసిందే.
ఎందుకో ఆయన వైసీపీ దరి చేరలేదు
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్స్ కోసం గొంతెత్తిన అయన ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నాడు వైసీపీ ‘సాక్షి’ మీడియా రూపంలో ఆయనకు అండగా నిలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ముద్రగడకు పెద్ద పదవే లభిస్తుందని చాలా అంచనా వేశారు. కానీ ఎందుకో ఆయన వైసీపీ దరి చేరలేదు.. ఆపార్టీ కూడా ఈయన్ని దరిచేర్చుకోలేదు. అలా ఆయన రాజకీయంగా స్తబ్దుగానే ఉండిపోయారు.
సంక్రాంతి పండుగకు సంప్రదాయ ఆట
తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజుకు సంబంధించిన ఓ బాధ్యతను ముద్రగడ తీసుకున్నారు. అదే కోడి పందాలు, ఇతర సంప్రదాయ వేడుకలు. రాబోయే సంక్రాంతి పండుగకు సంప్రదాయ ఆటలైన కోడి పందాలు.. ఇతర వాటిపై పోలీసులు నిర్భందం విధిస్తున్నారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కలుగజేసుకుని పర్మిషన్ ఇప్పించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.
మరి ప్రభుత్వం స్పందిస్తుందా?
ప్రతి సంవత్సరం కోడి పందాల పర్మిషన్ విషయంలో ప్రభుత్వాలతో రఘురామరాజు పోరాడేవారు. అవసరం అయితే సుప్రీం కోర్టుకు సైతం వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఢల్లీిలో ఎక్కువగా ఉంటున్నందున, ఆయన బాధ్యతలు ముద్రగడ తీసుకున్నట్లు అయ్యింది. చూడాలి జగన్ ప్రభుత్వం ముద్రగడ వినతిపై ఎలా స్పందిస్తుందో.