కాలం కలిసి రాకపోతే తాడేపామై కరుస్తుంది అంటారు. కాలం కలిసిరాకపోతే తాడే కాదు.. ఒకేతల్లి కడుపున పుట్టిన తోబుట్టువు కూడా శత్రువై ఎదురు నిలుస్తుంది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డిది.
తండ్రి వై.యస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన రాజకీయ వారసుడిగా రంగంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో వచ్చిన విభేదాల కారణంగా జైలు పాలైన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ను బయటకు రావడం, స్వంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం శరవేగంగా జరిగిపోయాయి. 2014 ఎన్నికల్లో ఓటమిని చవిచూసినప్పటికీ 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు.
ఎల్లో మీడియా కి వెన్నుపోటు పొడవబోతున్న చంద్రబాబు నాయుడు?
జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున సోదరి షర్మిళ 3 వేల కి.మీ. పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. అలాగే ఎన్నికల్లో ఆయన తరపున ఊరూరా తిరిగి ప్రచారం కూడా నిర్వహించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చెల్లిని దూరం పెట్టారు.
దీనికి తోడు ఆస్తుల పంపకాల్లో కూడా ఆమెను లెక్కలోకి తీసుకోవడం లేదనే వార్తలు వచ్చాయి. దీంతో ఆమె తెలంగాణలో వైఎస్సార్‌టీపీని స్థాపించి రాజకీయాలు కొనసాగిస్తున్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది. అలాగే కాంగ్రెస్ ఆ పార్టీని విలీనం చేయడానికి కూడా అన్నీ సిద్ధం చేసుకున్నారు.
ముందుగా అనుకున్న ప్రకారం అయితే తెలంగాణ ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలి. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం ఆమె సేవలను ఏపీ కాంగ్రెస్ అభివృద్దికి వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యింది.
ఈ క్రమంలోనే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం షర్మిళను పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలపాలని, అవసరం అయితే తెలుగదేశం, జనసేన కూటమి మద్దతు కూడా కూడగట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే జరిగితే పులివెందుల దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.